E-Paper
Advertisement

America : యూఎస్ లో మరోసారి కాల్పులు.. నలుగురు మృతి..

America : యూఎస్ లో మరోసారి కాల్పులు.. నలుగురు మృతి..
Advertisement

America : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. సౌత్‌ఈస్ట్‌ వాషింగ్టన్‌లోని అనకోస్టియా ప్రాంతంలో గుడ్‌హోప్‌ రోడ్‌లో దుండగుడు ఈ దురాగతానికి పాల్పడ్డాడు. కాల్పుల ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నారు. కాల్పుల సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

సౌత్‌ఈస్ట్‌ వాషింగ్టన్‌లోని అనకోస్టియా ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ నేపథ్యంలోనే నిందితుడు కాల్పులకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
వాషింగ్టన్‌లో ఈ ఏడాది ఇప్పటికే అనేక కాల్పుల ఉదంతాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు 150 మందికిపైగా మృత్యువాతపడ్డారు. 2 దశాబ్దాల తర్వాత తక్కువ సమయంలో భారీ సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వాష్టింగన్‌ పోస్ట్‌ తెలిపింది. ఆగస్టులో ఇప్పటివరకు జరిగిన కాల్పుల ఘటనల్లో 12 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.

Advertisement

అమెరికాలోని ఏదో ఒక ప్రాంతంలో నిత్యం కాల్పులు జరుగుతున్నాయి. అమాయకుల ప్రాణాలను ఉన్మాదులు బలి తీసుకుంటారు. షాపింగ్ మాల్స్, స్కూల్స్, ఆడిటోరియాలను లక్ష్యం చేసుకుని కాల్పులకు తెగబడుతున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×