E-Paper
Advertisement

Manmohan Singh Death: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ ఇక లేరు

Manmohan Singh Death: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ ఇక లేరు
Advertisement

Manmohan Singh Hospitalized: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్ను మూశారు. ఢిల్లీలోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్ సింగ్‌ను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు.  వెంటనే ఆయన్ని ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించారు. కానీ, బతికించలేకపోయారు.

మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఆయన ఆరోగ్య స్థితిగతులను కుటుంబ సభ్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.  ఆయన కన్ను మూసినట్లు తెలిసి సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్ మరణ వార్త తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎయిమ్స్ హాస్పిటల్‌కు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన భౌతిక కాయం అక్కడే ఉంది. శుక్రవారం ఉదయం ఆయన నివాసానికి చేర్చే అవకాశాలున్నాయి.

Advertisement

Also Read: Indian Railways: కేబుల్ బ్రిడ్జిపై రైలు.. చరిత్రలో ఇదే తొలిసారి, వీడియో చూస్తే మైండ్ బ్లాకే!

మన్మోహన్ సింగ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం బాగా క్షిణించింది. శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎయిమ్స్ వైద్యశాలకు తరలించారు. 92 ఏళ్ల వయసుగల మన్మోహన్ సింగ్ నూతన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో మంచి ఆర్థికవేత్తగా తనకంటూ గుర్తింపు పొందారు. అలాగే దేశానికి 15వ ప్రధానిగా మన్మోహన్ సింగ్ మంచి సుపరిపాలన అందించి తనదైన మార్క్ పాలనాపరంగా చాటిచెప్పారు. మన్మోహన్ మరణ వార్త తెలిసి.. రాజకీయవేత్తలు, ప్రముఖులు నివాళ్లు అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. గొప్ప నాయకుడిని, ఆర్థిక వేత్తను కోల్పోయామంటూ.. మన్మోహన్ మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×