E-Paper
Advertisement

Former Minister K Natwar Singh: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

Former Minister K Natwar Singh: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
Advertisement

Former External Affairs Minister K Natwar Singh Dies: కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. కేంద్ర మాజీ మంత్రి, మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్(93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు శనివారం ఆరోగ్యం మరింత క్షీణించడంతో అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన మృతి చెందినట్లు ఆయన కుమారుడు, ఎమ్మెల్య జగత్ సింగ్ వెల్లడించారు.

నట్వర్ సింగ్ 1931 మే 16న రాజస్తాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ జిల్లాలోని జఘినా గ్రామంలో జన్మించారు. అజ్మీర్ లోని మాయో కళాశాలతోపాటు గ్వాలియర్ లోని సింధియా పాఠశాలలో ప్రారంభ విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. అక్కడి నుంచి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కార్పస్ క్రిస్టీ కళాశాలలో చదువు కొనసాగించాడు. అనంతరం చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ స్కాలర్ గా కూడ చేశాడు.

Advertisement

Also Read: రూ. కోట్ల విలువ చేసే 16 కార్లు దగ్ధం.. ఎలా అంటే..?

రాజకీయాల్లోకి వచ్చిన నట్వర్ సింగ్.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్ప సమయంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.  ఆ తర్వాత 2004 నుంచి 2005 మధ్య యూపీఏ హయాంలో విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే పాకిస్తాన్ లో భారత రాయబారిగా పనిచేశారు. అంతకుముందు 1966 నుంచి 1971 వరకు ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కార్యాలయంలో కూడా పనిచేశారు. 1984లో కేంద్రం నట్వర్‌ను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. దీంతో పాటు ఆయన పలు పుస్తకాలను సైతం రాశారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×