E-Paper
Advertisement

Bangladesh: తీవ్ర విషాదం.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

Bangladesh: తీవ్ర విషాదం.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, ఆ దేశపు తొలి మహిళా ప్రధాని ఖలీదా జియా (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ఢాకాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణవార్తతో బంగ్లాదేశ్‌లో ఒక శకం ముగిసినట్లయింది. ఆమె మృతి పట్ల రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధ్యక్షురాలిగా ఖలీదా జియా ఆ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆమె మూడు పర్యాయాలు (1991-1996, 2001 ఫిబ్రవరి-మే, 2001-2006) ప్రధానమంత్రిగా సేవలు అందించారు. బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియార్ రెహమాన్ భార్య అయిన ఆమె, ఆయన మరణానంతరం పార్టీ పగ్గాలను చేపట్టి, దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం, మహిళా సాధికారత కోసం అనేక సంస్కరణలు చేపట్టారు.

Advertisement

Also Read: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి

చివరి రోజుల్లో ఆమె అనేక రాజకీయ సవాళ్లను, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. అవినీతి ఆరోపణల కేసులో జైలు శిక్ష అనుభవించిన ఆమె, గత కొన్నేళ్లుగా గృహ నిర్బంధంలో ఉంటూనే కాలేయం, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నారు. 17 ఏళ్ల తర్వాత ఆమె కుమారుడు తారిఖ్ రెహమాన్ లండన్ నుండి బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టాడు. మొత్తానికి ఆమె మరణం బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద శూన్యాన్ని మిగిల్చింది.

Advertisement

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×