E-Paper
Advertisement

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం..  ఆకస్మిక వరదలు,  కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి
Advertisement

Jammu kashamir Flash floods: జమ్మూకాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో అర్థరాత్రి ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఆకస్మిక వరదలు ఒక్కసారిగా వివిధ ప్రాంతాలను ముంచెత్తాయి. ఫలితంగా వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహించాయి. అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ఎక్కడ చూసినా వాహనాలు కుప్పలు కుప్పలుగా కనిపించాయి.

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం-జమ్మూకాశ్మీర్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో భారీ వర్షాలు కుమ్మేశాయి.  ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గల్లంతయ్యారు. అర్థరాత్రి విరుచుకుపడడంతో ఎటు వైపు వెళ్లాలో తెలియక చాలామంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది.

Advertisement

వివిధ ప్రాంతాలను చుట్టేసిన ఆకస్మిక వరదలు-ప్రముఖ టూరిస్టు ప్రాంతాల్లో వాహనాలు కుప్పలు కుప్పలుగా పైనుంచి కిందకు కొట్టుకువచ్చాయి.  పూంచ్ జిల్లాలో ఆకస్మిక వరదలు నేపథ్యంలో కొండచరియలు విరిగిపడ్డాయి. రాజౌరిలోని  దర్హాలి నది నీటిమట్టం ఒక్కసారి పెరిగింది. దీంతో వివిధ ప్రాంతాల్లోకి నీరు ప్రవేశించడంతో జలమయం అయ్యాయి. బేలా బస్టాండ్ వద్ద ఉంచిన అనేక వాహనాలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి.

8 మంది మృతి- పలువురు గల్లంతు- అనేక ఇళ్లు, కుటుంబాలు నీటిలో చిక్కుకుపోయాయి. ప్రాణ, ఆస్తి నష్టం కాకుండా పశు నష్టం భారీగా జరిగినట్లు సమాచారం.  అనేక భవనాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతంలో  భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక కొద్ది గంటల్లో భారీ వర్షాలు కుమ్మేశాయి.  మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు రంగంలోకి దిగారు.

Advertisement

నిలిచిపోయిన వైష్ణో దేవి యాత్ర-ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. ప్రతికూల వాతావరణం, రాత్రంతా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వైష్ణో దేవి యాత్రను నిలిపి వేశారు అధికారులు. రాత్రి కురిసిన కుండపోత వర్షానికి వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో వాహనాలపై రాళ్లు, కొండచరియలు విరిగిపడినట్టు తెలుస్తోంది.

ALSO READ: కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

భైరవ్ వ్యాలీ మార్గంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఆదివారం ఉదయం నుంచి పూంచ్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.  రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  వర్షాలకు నలుగురు మరణించగా, పలువురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.  చనిపోయినవారు ఎక్కువగా సురాన్‌కోట్, తహసీల్‌ ప్రాంతాలకు చెందిన వారని చెబుతున్నారు.

అక్కడ చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలను చర్యలు చేపట్టాయి.  వరదలపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ఆలస్యం లేకుండా సహాయం అందేలా చూడాలని అధికారులను  ఆదేశించారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×