E-Paper
Advertisement

మైసూరులో విషాదం.. ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన కుర్‌కురే!

మైసూరులో విషాదం.. ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన కుర్‌కురే!
Advertisement

Toy Ball: ఈ రోజుల్లో పిల్లలకు ఏదో ఒక స్నాక్ ప్యాకెట్ చేతిలో పెట్టడం చాలామంది తల్లిదండ్రులకు అలవాటుగా మారింది. కానీ, చిన్న అలసత్వం ఎంతటి ఘోరానికి దారితీస్తుందో చెప్పడానికి కర్ణాటకలోని మైసూరులో జరిగిన ఈ దారుణ సంఘటనే ఒక నిదర్శనం.

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఐదేళ్ల బాలుడికి తల్లిదండ్రులు కుర్‌కురే ప్యాకెట్ కొనిచ్చారు. సంతోషంగా కుర్‌కురే తింటున్న ఆ చిన్నారి, ప్యాకెట్‌లో ఉచితంగా వచ్చిన చిన్న టాయ్ బాల్‌ను కూడా చూసుకోకుండా నోట్లో వేసుకొని మింగేశాడు. దురదృష్టవశాత్తు ఆ ప్లాస్టిక్ బంతి నేరుగా పోయి గొంతులో ఇరుక్కుపోయింది. దంతో ఊపిరాడక ఆ బాలుడు క్షణాల్లోనే స్పృహ కోల్పోయి కిందపడిపోయాడు. భయపడిపోయిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాలుడు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు దృవీకరించారు.

Advertisement

కంటికి రెప్పలా చూసుకుంటున్న ఒక్కగానొక్క కొడుకు కళ్లముందే అనంత లోకాలకు వెళ్ళిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు విసిసేలా ఏడుస్తున్నారు. ఈ విషాదం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. పిల్లల చేతికి తినుబండారాలు ఇచ్చేటప్పుడు, వాటిలో ఉండే చిన్నచిన్న ప్లాస్టిక్ బొమ్మల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సంఘటన మనకు హెచ్చరిస్తోంది.

Also Read: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి!

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×