E-Paper
Advertisement

Maharashtra Fire Accident: మహారాష్ట్రలోని ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, ఐదురురు మృతి

Maharashtra Fire Accident: మహారాష్ట్రలోని ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, ఐదురురు మృతి
Advertisement

Maharashtra Fire Accident:మహారాష్ట్రలోని భండారా జిల్లాలో శుక్రవారం  పెను ప్రమాదం జరిగింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని ఆర్కే బ్రాంచ్ సెక్షన్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఐదుగురు ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ఉద్యోగులు గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ లోపల గందరగోళం నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఫ్యాక్టరీ లోపల ఉన్న ఇతర ఉద్యోగులను సురక్షితంగా తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ , వైద్య బృందాలను రంగంలోకి దింపినట్లు రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో కాంప్లెక్స్ లోపల పేలుడు సంభవించిందని జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్టే తెలిపారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

ఫ్యాక్టరీలో భద్రతకు సంబంధించి తలెత్తిన ప్రశ్నలు:
ఈ సంఘటన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలకు సంబంధించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పని చేస్తున్నారు. పేలుడు శబ్దం చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వినిపించింది. ఈ విషయమై పోలీసులు, ఫ్యాక్టరీ యాజమాన్యం దర్యాప్తు ముమ్మరం చేశారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×