E-Paper
Advertisement

Fire Accident: అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. బాల్కానీల నుంచి దూకీ.. దారుణం!

Fire Accident: అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. బాల్కానీల నుంచి దూకీ.. దారుణం!
Advertisement

Fire Accident: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ యాక్సిడెంట్ జరగగానే భారీగా మంటలు ఎగిసిపడడంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. మంటల్లో పలువురు అపార్ట్‌మెంట్‌ వాసులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన కాలనీ వాసులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేశారు. ఇప్పటికే 25 మందిని ఫైర్‌ సిబ్బంది కాపాడినట్లు సమాచారం.

అయితే అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదం వల్ల చాలా మంది పొగలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని కూడా రక్షించి హాస్పిటల్‌కు తరలించేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌ ఆరో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఫైర్ అలారం వెంటనే మోగడంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారంతా భయంతో బయటకు పరుగులు పెట్టారు.

Advertisement

ALSO READ: LKG చదువుతున్న చిన్నారిపై.. దారుణం..!

ఈక్రమంలోనే మహిళలు వారి బిడ్డలను రక్షించేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పై అంతస్తులో మంటల వల్ల పొగ నిండిపోవడంతో ప్రాణాలను కాపాడుకోవడానికి బాల్కనీ నుంచి పిల్లలను కింద ఫ్లోర్‌లో ఉన్న వారికి అందించారు. అందుకే భారీ ప్రాణ నష్టం తప్పిందని పోలీసులు తెలిపారు. స్వల్పంగా గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×