E-Paper
Advertisement

Rasagulla Fight: వివాహ విందులో రసగుల్లా లొల్లి.. పొట్టుపొట్టు కొట్టుకున్న చుట్టాలు..! వీడియో వైరల్

Rasagulla Fight: వివాహ విందులో రసగుల్లా లొల్లి.. పొట్టుపొట్టు కొట్టుకున్న చుట్టాలు..!  వీడియో వైరల్
Advertisement

Rasagulla Fight: బీహార్ రాష్ట్రంలోని బోధ్ గయలో నవంబర్ 29న జరిగిన ఒక వివాహ వేడుక, చిన్న విషయానికి చెదిరిపోయి చివరకు క్యాన్సల్ కావడంతో పెను సంచలనం సృష్టించింది. ఒక పెళ్లి విందులో వడ్డించిన రసగుల్లా స్వీట్ సరిపోకపోవడమే ఈ భారీ ఘర్షణకు, శుభకార్యం రద్దుకు ప్రధాన కారణంగా నిలిచింది. ఈ వింత సంఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బీహార్‌లోని బోధ్ గయలో వింత ఘటన
అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లగా.. వివాహం స్థానికంగా ఉన్న ఒక హోటల్‌లోని బాంకెట్ హాల్‌లో జరుగుతుండగా, విందు సమయంలో రసగుల్లా స్వీట్లు తక్కువయ్యాయి. దీంతో మొదట వరుడి వైపు బంధువులకు, ఆ తర్వాత వధువు తరపు వారికి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ చిన్నపాటి గొడవ చిలికిచిలికి గాలివానలా మారి, ఇరు కుటుంబాల మధ్య పెద్ద యుద్ధంగా మారింది.

Advertisement

విచక్షణ మర్చిపోయి కొట్టుకున్న వధూవరుల కుటుంబాలు..
వివాహ వేదిక ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. అతిథులు తమ విచక్షణను కోల్పోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. అంతేకాకుండా, అక్కడున్న కుర్చీలు, ప్లేట్లు వంటి వస్తువులతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో ఇరువైపులా చాలా మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

వివాహాన్ని రద్దు చేసుకున్న వధువు కుటుంబ సభ్యులు
ఈ గొడవ తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపుతప్పడంతో, వివాహం నిలిచిపోయింది. వరుడి కుటుంబ సభ్యులు గొడవ జరిగినప్పటికీ పెళ్లిని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. అయితే, వధువు కుటుంబ సభ్యులు మాత్రం ఘర్షణ కారణంగా తీవ్ర మనస్తాపం చెంది, వివాహాన్ని రద్దు చేసుకున్నారు, ముందుకు సాగకూడదని నిర్ణయించుకున్నారు. అత్యంత కీలకమైన వివాహ ముహూర్తానికి కొద్ది సమయం ముందు ఈ గొడవ జరగడంతో, ఇరు కుటుంబాలు అవమానానికి, తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యాయి.

Advertisement

వివాదానికి వరకట్న వేధింపులు కూడా తోడైంది..
అయితే, ఈ గొడవ అనంతరం వివాదానికి మరో కోణం కూడా తోడైంది. వధువు కుటుంబం తరుపున వరుడి కుటుంబంపై వరకట్న వేధింపుల కేసును కూడా బోధ్ గయ పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేశారు. పెళ్లికి ముందు అదనపు వరకట్నం డిమాండ్ చేశారనే ఆరోపణలను వధువు తండ్రి చేశారు. మరోవైపు, వరుడి తండ్రి మాత్రం వరకట్నం డిమాండ్ అనేది అవాస్తవమని, కేవలం రసగుల్లా కొరత కారణంగానే గొడవ జరిగిందని, ఆ తర్వాత పెళ్లిని రద్దు చేయకుండా ఉండేందుకు తమపై తప్పుడు వరకట్న కేసు పెట్టారని ఆరోపించారు.

Also Read: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా నేటి నుంచి మంత్రి లోకేశ్ విదేశీ పర్యటన

ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కేవలం ఒక స్వీట్ కోసం మొదలైన స్వల్ప విషయం చివరికి ఒక శుభకార్యాన్ని ఆపేయడం, ఇరు కుటుంబాల మధ్య వైరాన్ని పెంచడం వల్ల ఈ సంఘటన విషాదాంతానికి దారితీసింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×