E-Paper
Advertisement

Chhattisgarh: మావోలకు మరో ఝలక్.. ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు హతం..

Chhattisgarh: మావోలకు మరో ఝలక్.. ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు హతం..
Advertisement

Chhattisgarh: మావోయిస్టులు మరో సారి ఎదురుకాల్పులు జరిపారు.. అయితే ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో జిల్లాలోని జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇంద్రావతి నది పరీవాహక అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.

నది ప్రాంతంలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు హతం

Advertisement

అయితే సుమారు గంటకు పైగా సాగిన ఈ పోరాటంలో భద్రతా బలగాలు పైచేయి సాధించాయి. ఇక కాల్పులు తగ్గుముఖం పట్టిన తర్వాత ఘటనా స్థలంలో సోదాలు చేయగా, ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన వారిని గుర్తించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న జవాన్లందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం తెలిపారు.

ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం

Advertisement

ఘటనా స్థలం నుండి భారీగా మారణాయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల వద్ద ఉన్న తుపాకులు, మందు గుండు సామాగ్రి, విప్లవ సాహిత్యం, భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా మావోయిస్టులు నక్కి ఉన్నారేమో అన్న అనుమానంతో ఇంద్రావతి నది పరిసర ప్రాంతాల్లో గాలింపు (సెర్చింగ్) చర్యలను మరింత ముమ్మరం చేశారు.

Also Read: మోదీ జీ.. ఇది భారతదేశం.. ఉత్తర కొరియా కాదు.. రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు

మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భ్రదతా దళాల వరుస ఆపరేషన్లు..

గత కొద్ది కాలంగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా దళాలు వరుస ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో జరిగిన తాజా ఎన్‌కౌంటర్ మావోయిస్టు కేడర్‌కు పెద్ద దెబ్బగా భావించవచ్చు. మావోయిస్టుల కదలికలను అడ్డుకోవడానికి, గిరిజన ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడటానికి ప్రభుత్వం బలగాలను అప్రమత్తం చేసింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×