E-Paper
Advertisement

సినిమా రేంజ్ సీన్.. స్తంభం కింద పులి పహారా, దెబ్బకు స్తంభాలెక్కిన ఉద్యోగులు!

సినిమా రేంజ్ సీన్.. స్తంభం కింద పులి పహారా, దెబ్బకు స్తంభాలెక్కిన ఉద్యోగులు!
Advertisement

Chandrapur: గంటపాటు ఉద్యోగులకు చుక్కలు చూపింది. ఏ ఒక్కరు కిందికి దిగినా వారి పనైపోయినట్టే. ఐదు..10 నిమిషాలు కాదు, పులి దెబ్బకు ఏకంగా గంటలపాటు చెట్లు మీద గడిపారు ఉద్యోగులు. ఈ ఘటనకు సంబంధించి సమీపంలోని ఓ వ్యక్తి చిత్రీకరించిన వీడియో వైరల్ అయ్యింది. మహరాష్ట్రలో వెలుగులోకి వచ్చింది.

సినిమా రేంజ్ సీన్- చంద్రపూర్ జిల్లాలో పులి సంచారం స్థానికులే కాకుండా చివరకు ఉద్యోగులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఏ సమయంలో పులి వచ్చి తమ మీద దాడి చేస్తుందేమోనని భయంతో హడలిపోతున్నారు. ముల్ తాలూకాలోని పుల్జరి గ్రామంలో విద్యుత్ లైన్లకు మరమ్మతు చేస్తున్నారు ఎలక్ట్రికల్ ఉద్యోగులు. విద్యుత్ లైన్‌పై నిర్వహణ, మరమ్మతు పనులు చేస్తుండగా అకస్మాత్తుగా పులి వారి ముందుకు ప్రత్యక్షమైంది.

Advertisement

స్తంభం కింద పులి పహారా- దీంతో ఉద్యోగుల మధ్య గందరగోళం నెలకొంది. వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి విద్యుత్ స్తంభంపైకి ఎక్కేశారు. పులి స్తంభం ఉన్న ప్రాంతంలో తిరగడం గమనించింది. ఉద్యోగులు కిందకు దిగలేకపోయారు. ఐదు, పది నిమిషాలు కాదు ఏకంగా ఉద్యోగులు స్తంభం మీద గంటపాటు ఉండిపోయారు. మనుషులు ఎంతకీ కిందకు దిగిరాకపోవడంతో చివరకు అడవిలోకి వెళ్లిపోయింది.

దెబ్బకు స్తంభాలెక్కిన ఉద్యోగులు! పులి అడవిలోకి వెళ్లిన తర్వాత మళ్లీ వస్తుందేమోనన్న భయంతో మరో పది నిమిషాలు చూసిన తర్వాత కిందకు దిగారు. దీంతో పెండింగ్ వర్క్‌ని పూర్తి చేసి అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఒక్కరోజుకే భయపడితే ఎలా? ఏళ్ల తరబడి ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నామని అంటున్నారు. మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటవీ గ్రామాల్లో పని చేస్తున్న మహావితరణ్- అటవీ శాఖ- ఇతర ప్రభుత్వ ఉద్యోగుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. కనీసం విద్యుత్ ఉంటే ఆ వెలుతురుకు పులి రావడం తగ్గే అవకాశముందని అంటున్నారు.

?utm_source=ig_embed&ig_rid=AN7FGwO1wg0eTd1fbyb1Wk6

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×