E-Paper
Advertisement

ఎలాన్ మస్క్ ఆందోళన.. ఇండియాలో జననాల రేటు తగ్గుదల, గణాంకాలతోపాటు

ఎలాన్ మస్క్ ఆందోళన.. ఇండియాలో జననాల రేటు తగ్గుదల, గణాంకాలతోపాటు
Advertisement

Elon Musk: దేశంలో జనాభా పెంచాలని పదే పదే పలువురు రాజకీయ నేతలు చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తున్న ప్రజలు జనాభా పెంపుకు ఏ మాత్రం ఇష్టపడడం లేదు. ఒకప్పుడు ఇద్దరు పిల్లలుంటే చాలనుకునేవారు. ఇప్పుడు ఒక్కరితో సరి పెట్టుకున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. దేశంలో జననాల రేటు పడిపోవడంతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇండియాలో జననాల రేటు తగ్గుదలపై ఎలాన్ మస్క్ ఆందోళన

Advertisement

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇండియా వ్యాప్తంగా వైరల్, ఆపై చర్చ కూడా మొదలైంది. భారత్‌లో జననాల రేటు తగ్గుతోందని రాసుకొచ్చారు. జనాభా స్థిరత్వానికి అవసరమైన ప్రతి స్థాపన స్థాయి కంటే కిందకు పడిపోయిందన్నారు.దీనికి సంబంధించిన గణాంకాల ఫోటోను అందులో జత చేశారు.

భారతదేశ చరిత్రలో సంతానోత్పత్తి రేటు ప్రతి మహిళకు 2.1 పిల్లలు అనే ప్రతి స్థాపన స్థాయి కంటే కిందకు పడిపోయిందని అందులో ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో ఈ రేటు 2.3 నుంచి 1.9కి పడిపోయిందన్నారు. ఢిల్లీలో సంతాన ఉత్పత్తి రేటు 1.2కి పడిపోయిందన్నారు. ఫిన్‌లాండ్ కంటే చాలా తక్కువని పేర్కొన్నారు.

Advertisement

దశాబ్దంలో సంతానోత్పత్తి రేటు 2.3 నుంచి 1.9కి తగ్గుదల

భారత దేశ జనాభా త్వరలో పడిపోతుంది బహుశా చాలా వేగంగా అనే శీర్షికతో ఓ పత్రికలో జూన్ 4న ప్రచురించింది. ఓ కథనాన్ని ఏఎఫ్ పోస్ట్ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ రాసుకొచ్చారు. బాగా చదువుకున్న వారిలో ఈ రేటు చాలా ఏళ్ల కిందటే పడిపోయిందంటూ రాసుకొచ్చారు.

ఇక నార్వే కంటే కేరళ, తమిళనాడు, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సంతాన ఉత్పత్తి రేటు కిందికి పడిపోయిందన్నారు. ఇక అమెరికా జనభా కంటే తెలంగాణ దిగువున ఉందని ఆ డీటేల్స్‌లో ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే భారత్ కంటే బంగ్లాదేశ్‌లో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉంది. ఇక రాజస్థాన్ 2.3 శాతం, ఉత్తరప్రదేశ్-2.6, బీహార్ -2.8 శాతం ఉందని డేటాను షేర్ చేశారు.

ALSO READ: గ్యాస్ సిలిండర్ ధరల పెంపు.. మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మూడు ప్రశ్నలు, వంట గదులను నాశనం చేసేలా 

గతేడాది ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 1.9గా నమోదు అయ్యిందని తెలిపింది. జనాభా అవసరానికి 2.1 స్థాయి కంటే తక్కువని ప్రస్తావించింది. సంతానోత్పత్తి రేటు కంటిన్యూ అయితే భవిష్యత్తులో మునుపటి తరం కంటే చిన్నదిగా మారి దేశ జనాభా క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని విశ్లేషించిన విషయం తెల్సిందే.

జననాల రేటు తగ్గుతున్నప్పటికీ 146 కోట్లకు పైగా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతోంది. 2023లో చైనాను అధిగమించి భారత్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. విద్య, పట్టణీకరణ, మహిళలు ఉద్యోగాల్లో చేరడం, మారుతున్న కుటుంబ ప్రాధాన్యతలు వంటి అంశాలు జననాల రేటు తగ్గడానికి కారణాలుగా చెబుతున్నాయి. దేశంలో ఇప్పటికీ సామాజిక, ఆర్థిక అసమానతలు, ప్రసూతి మరణాలు, లింగ వివక్ష వంటి సవాళ్లు ఉన్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రస్తావించింది.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×