E-Paper
Advertisement

Election-time seizures: ఇప్పటివరకు ఎన్నికల సమయంలో పట్టుబడ్డ మొత్తం విలువెంతో తెలుసా..?

Election-time seizures: ఇప్పటివరకు ఎన్నికల సమయంలో పట్టుబడ్డ మొత్తం విలువెంతో తెలుసా..?
Advertisement

Election-time seizures Data: భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ కొనసాగుతుంది. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ డబ్బు, మాదక ద్రవ్యాలు, బంగారంకు సంబంధించిన తాజా గణాంకాలు, సమగ్ర డేటాను భారత ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు రూ. 8889.74 కోట్లు విలువ గల డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలను సీజ్ చేశామని ఎన్నికల కమిషన్ పేర్కొంది. 45 శాతంతో మాదక ద్రవ్యాలు మొదటి స్థానంలో నిలిచాయి. వీటి విలువ సుమారు రూ. 3958 కోట్లు ఉంటుందని ఎన్నికల కమిషన్ అంచనా వేసింది. మార్చి 1 తర్వాత ఎన్నికల కమిషన్ ఎక్కువ మొత్తంలో వీటిని స్వాధీనం చేసుకుందని పేర్కొంది.

Advertisement

నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం రూ. 8889 కోట్లలో, నగదు స్వాధీనం కేవలం రూ. 849.15 కోట్లు అని, 5.39 కోట్ల లీటర్ల మద్యం పట్టుబడగా దాని విలువ దాదాపు రూ. 814 కోట్లు ఉంటుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు 1260.33 కోట్ల విలువైన లోహాలు స్వాధీనం చేసుకోగా, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ రూ. 2006.56 కోట్లు.

Also Read: తవుడు బస్తాల మధ్య 7 కోట్లు.. సినీ తరహాలో తరలింపు.. చివరికి..?

Advertisement

ఇందులో గుజరాత్‌లో దాదాపు రూ. 1461 కోట్లు స్వాధీనం చేసుకుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఆ తరువాత స్థానంలో రూ. 1134 కోట్ల రూపాయలతో రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. 75 ఏళ్ల లోక్ సభ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. కాగా ఈ మొత్తం రూ. 9 వేల కోట్లు దాటనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×