E-Paper
Advertisement

Rajya Sabha polls-2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్.. 37 సీట్లకు ఎన్నికలు, తెలంగాణలో రెండు సీట్లకు

Rajya Sabha polls-2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్.. 37 సీట్లకు ఎన్నికలు, తెలంగాణలో రెండు సీట్లకు
Advertisement

Rajya Sabha polls-2026: రాజ్యసభలో ఖాళీ అవుతున్న సీట్లకు సంబంధించి బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. 10 రాష్ట్రాల నుంచి 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో తెలంగాణ నుంచి రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ తరపున ఎవరు ఎన్నిక అవుతున్నారు? అనేది అసలు ప్రశ్న.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్.. 37 సీట్లకు ఎన్నికలు

Advertisement

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ బుదవారం విడుదల చేసింది ఎన్నికల సంఘం. తెలంగాణ సహా మొత్తం 10 రాష్ట్రాల్లో 37 సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈనెల 26న నోటిఫికేషన్ ఇవ్వనుంది ఈసీ. నామినేషన్ల దాఖలకు మార్చి 5 వరకు గడువు ఉంది. ఆరున నామినేషన్ల పరిశీలన జరగ్గా ఉపసంహరణకు గడువు మార్చి 9 వరకు ఉంది. మార్చి 16న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఐదుగంటలకు ఓట్ల లెక్కింపు జరగనుంది.

మొత్తం 37 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో 20 మంది పదవీకాలం ఏప్రిల్ రెండుతో ముగియనుంది. జనవరి మొదటి వారం నుంచి ఓ సీటు ఖాళీగా ఉంది. మిగతా 16  మంది సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 9తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆయా ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Advertisement

తెలంగాణలో రెండు సీట్లు ఖాళీ.. రేసులో చాలామంది నేతలు

మార్చి 16న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆయా సీట్లకు ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎన్నికల ప్రక్రియను మార్చి 20, 2026 లోపు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఇక ఖాళీ అయన సీట్లలో మహారాష్ట్ర-7, ఒడిశా-3,తమిళనాడు, పశ్చిమ బెంగాల్ నుండి ఆరేసి సీట్లు, అస్సాం-3, బీహార్- 4, ఛత్తీస్‌గఢ్-2, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ నుండి ఒక్కొక్క సీటు, తెలంగాణ నుండి రెండు సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీరిలో కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ పదవీకాలం ఏప్రిల్ 9తో ముగుస్తుంది.  మరి తెలంగాణ నుంచి ఈ రెండు సీట్లకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఎన్నిక అవుతారో చూడాలి. రాజ్యసభ ఎన్నికలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల ఓట్ల ద్వారా ఎన్నిక జరుగుతుంది.

ALSO READ: రీల్స్ చేస్తూ డ్రైవింగ్.. దిల్లీ యాక్సిడెంట్ కేసులో.. వెలుగులోకి షాకింగ్ వీడియో

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×