E-Paper
Advertisement

Thiruvananthapuram: మాజీ సీఎం విజయన్‌కు కష్టాలు.. ఈడీ దాడులు, కేరళంలో ఏం జరుగుతోంది?

Thiruvananthapuram: మాజీ సీఎం విజయన్‌కు కష్టాలు.. ఈడీ దాడులు, కేరళంలో ఏం జరుగుతోంది?
Advertisement

Thiruvananthapuram: కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ సోదాలు చేపట్టింది. ఆయనతోపాటు కేరళ వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సీఎంఆర్ఎల్ కేసులో ఈడీ దర్యాప్తు రద్దు చేయడానికి కేరళ హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఈ సోదాలు మొదలయ్యాయి. దీంతో కేరళం రాజకీయాల్లో ఈ కేసు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

కేరళం మాజీ సీఎం విజయన్ ఇంటిపై ఈడీ సోదాలు

Advertisement

కేరళం మాజీ సీఎం విజయన్ ఇంటిపై బుధవారం ఉదయం నుంచి ఈడీ దాడులు చేసింది. విజయన్ ఇంటితోపాటు కేరళం వ్యాప్తంగా దాదాపు 10 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుపుతోంది. కొచ్చిన్‌ మినరల్స్‌ అండ్‌ రూటిల్ లిమిటెడ్‌-CMRL నుంచి ఎక్స్‌లాజిక్‌ సొల్యూషన్స్‌ సంస్థకు కోట్లాది రూపాయలు దక్కాయన్నది ప్రధాన ఆరోపణ.

ఈ రెండు కంపెనీల డీల్ లో భాగంగా ఎలాంటి ఐటీ సేవలు అందించలేదు. ఎక్స్‌లాజిక్ సొల్యూషన్స్ కంపెనీ, మాజీ సీఎం విజయన్ కుమార్తె వీణకు చెందినది. రెండు సంస్థల మధ్య అధికారిక ఒప్పందం ఉంది. అవన్నీ మోసపూరితంగా ఉన్నాయని సీరియస్‌ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌-SFIO తన అభియోగాల్లో ప్రస్తావించింది.

Advertisement

CMRL కేసు వ్యవహారం.. న్యాయస్థానం నిరాకరణ తర్వాత

మూడేళ్ల కిందట అంటే 2023 ఆగస్టులో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అంతకుముందు 2017-20 మధ్యకాలంలో సీఎంఆర్‌ఎల్ నుంచి రూ.1.72 కోట్లు పొందినట్లు అందులోని కీలక అంశం. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని ఎస్‌ఎఫ్‌ఐఓకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు నేపథ్యంలో మాజీ సీఎం కూతురుపై కేసు నమోదు చేసింది ఈడీ.

ఈ నేపథ్యంలో మాజీ సీఎం నివాసం సహా పలు ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి ఈడీ రంగంలోకి దిగింది. మాజీ మంత్రి రియాస్ నివాసంపై సోదాలు చేసినట్టు సమాచారం. మహమ్మద్‌ రియాస్‌.. వీణ భర్త కావడం గమనార్హం. సీఎంఆర్ఎల్‌పై ఈడీ దర్యాప్తును రద్దు చేయడానికి కేరళ హైకోర్టు నిరాకరించిన మరుసటి రోజు ఈడీ దాడులు జరిగాయి.

ALSO READ: కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయాలకు ఎండ్ కార్డు.. ఏడు గంటలపాటు, మెట్టు దిగిన సిద్ధరామయ్య, నేడో రేపో

జరుగుతున్న పరిణామాలు ఆ కంపెనీకి ఎదురుదెబ్బగా చెబుతున్నారు. మొన్నటి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశం ప్రధానంగా మారింది. దీనిపై ఆనాడు కాంగ్రెస్ పార్టీ.. విజయన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×