E-Paper
Advertisement

ED : డేటా చోరీ కేసు.. ఈడీ యాక్షన్ షురూ..

ED : డేటా చోరీ కేసు.. ఈడీ యాక్షన్ షురూ..
Advertisement

ED : డేటా చోరీ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈడీ రంగలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. మనీలాండరింగ్ కోణంలో విచారణ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా డేటా చౌర్యం జరిగినట్లు తేలడంతో మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు . పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబరాబాద్ పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఈడీ అధికారులు నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా డేటా చోరీ కేసు సంచలనం రేపింది. 16.8 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం లీకైనట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తొలుత సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేప్టటారు. డేటా చౌర్యం చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. నిందితుల వద్ద రక్షణ రంగంలో పని చేస్తున్నవారి డేటాతోపాటు, పాన్ కార్డు, డెబిట్, క్రెడిట్ కార్డుదారుల వ్యక్తిగత వివరాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీంతో కీలక అంశాలు బయటపడ్డాయి.

Advertisement

డేటా చౌర్యం చేసిన నిందితులు జస్ట్ డయల్ ద్వారా సమాచారాన్ని అమ్మకానికి పెట్టారని పోలీసులు నిర్ధారించారు. వివిధ ఏజెన్సీల నుంచి ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు, మెయిల్ ఐడీ లాంటి వివరాలు సేకరిస్తున్న ముఠా ఆ డేటాను అమ్మకానికి పెట్టినట్లు గుర్తించారు. రుణాలు ఇచ్చే సంస్థలు ఈ డేటాను అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాయని దర్యాప్తులో తేలింది. రక్షణ రంగానికి చెందిన అధికారుల ఫోన్ నెంబర్లు, వాళ్లు పనిచేసే ప్రాంతం, మెయిల్ ఐడీల వివరాలు అమ్మకానికి పెట్టడంతో ఆర్మీ ఉన్నతాధికారులు సైబరాబాద్ పోలీసులతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ కూడా రంగంలోకి దిగింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×