E-Paper
Advertisement

బెంగాల్‌లో హింస-విధ్వంసం.. విగ్రహాలు ధ్వంసం, ఆఫీసులకు నిప్పు, ఈసీ ఆదేశాలతో అధికారులు

బెంగాల్‌లో హింస-విధ్వంసం.. విగ్రహాలు ధ్వంసం, ఆఫీసులకు నిప్పు, ఈసీ ఆదేశాలతో అధికారులు
Advertisement

West Bengal: పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల తర్వాత హింస, విధ్వంసం తీవ్రమైంది. రాత్రికి రాత్రే విగ్రహాలు ధ్వంసం చేయడం, బుల్‌డోజర్లు రంగంలోకి దిగడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. జరుగుతున్న పరిణామాలను గమనించిన కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.  విధ్వంసానికి ప్రేరేపిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పశ్చిమబెంగాల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

బెంగాల్‌లో హింస-విధ్వంసం.. ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం

Advertisement

బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు రాజకీయ దుమారానికి తెరలేపింది. ఫలితాలు వెలువడిన నుంచి ఆ రాష్ట్రంలోని పలుచోట్ల బీజేపీ-టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి కోల్‌కతాలో తృణమూల్‌ పార్టీ ఆఫీసుపై‌కి బుల్డోజర్‌ వెళ్లడంతో తీవ్ర కలకలం రేపింది.

అర్ధరాత్రి హాగ్‌ మార్కెట్‌ ప్రాంతంలో ఉన్న టీఎంసీ న్యూమార్కెట్‌ యూనియన్‌ ఆఫీసు వద్దకు కొందరు వ్యక్తులు వచ్చారు. బుల్డోజరుతో ఆఫీసును కూల్చే ప్రయత్నం చేశారు. రద్దీ ప్రాంతంలో స్థానిక దుకాణదారులు భయాందోళనకు గురై షాపు మూసివేసి అక్కడినుంచి పారిపోయారు. ఆ తర్వాత టీఎంసీ కార్యాలయం అగ్నికి ఆహుతైంది.

Advertisement

టీఎంసీ ఆఫీసుకు నిప్పు, ఈసీ ఆదేశాలతో రంగంలోకి అధికారులు

బుల్డోజర్లు తీసుకొచ్చిన వారి చేతుల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ జెండాలు కన్పించడం మరింత దుమారం మొదలైంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను టీఎంసీ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. బీజేపీ పరివర్తన్‌ మొదలైందని, బుల్డోజర్‌తో మార్పు వచ్చిందని ప్రస్తావించింది.

బీజేపీ కార్యకర్తలు వీధుల్లోకి వెళ్లి దాడులు చేస్తుంటే ఆ పార్టీ హైకమాండ్ వారికి ఆదేశాలు ఇచ్చినట్లు ఉందని, రోజు దుకాణాలు-ఆఫీసులను కూలుస్తున్నారని, రేపు రాజకీయ ప్రత్యర్థులను వదిలి పెట్టరేమోనని ప్రశ్నించారు. కోల్‌కతాతోపాటు వివిధ ప్రాంతాల్లోనూ ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్నాయి.

కమ్యూనిస్టు నేత లెనిన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు కొందరు వ్యక్తులు. ముర్షిదాబాద్ జిల్లా జియాగంజ్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిజోయ్‌గఢ్‌లో తృణమూల్‌ పార్టీ అభ్యర్థికి చెందిన ఆఫీసును ధ్వంసం చేశారు. అంతేకాదు ఆర్‌జీకర్‌ హత్యాచార బాధితురాలి తల్లి గెలిచిన ప్రాంతంలో టీఎంసీ కార్యాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు.

ALSO READ: విజయ్ పార్టీలో తెలుగు యంగ్ మహిళ కీర్తన.. శివకాశి నుంచి అసెంబ్లీకి, టీడీపీ-పీకే టీమ్‌లో ఒకప్పుడామె

వరుసగా జరుగుతున్న హింస, విధ్వంసం పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్.. బెంగాల్ ఈసీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతను మోహరించాలని ఆదేశాల్లో ప్రస్తావించారు.

హింస-విధ్వంసాన్ని ప్రేరేపిస్తున్న వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడటానికి కఠినమైన, తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కమిషన్నొక్కి చెప్పింది.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×