// // Discovery OF New Fish: అరేబియా సముద్రంలో కొత్త ఫిష్ గుర్తింపు.. డోరీ చేప, కొత్త ఔషధాల తయారీకి -->
E-Paper
Advertisement

అరేబియా సముద్రంలో కొత్త ఫిష్ గుర్తింపు.. డోరీ చేప, కొత్త ఔషధాల తయారీకి

అరేబియా సముద్రంలో కొత్త ఫిష్ గుర్తింపు.. డోరీ చేప,  కొత్త ఔషధాల తయారీకి
Advertisement

Discovery OF New Fish: భూమి మీద మాదిరిగా సముద్రాల్లో సంపద, రకరకాల చేపలు దర్శనమిస్తాయి. సమయం, సందర్భంగా ప్రకారం అవి అప్పుడప్పుడు దర్శినమిస్తాయి. 500 మీటర్ల లోతులో అరేబియా సముద్రంలో కొత్త రకం చేప జాతిని గుర్తించారు భారతీయ సైంటిస్టులు. కేవలం చేప కాదు, మన జీవ వైవిధ్యం గురించి కొత్త అవగాహన ఇచ్చే ఆవిష్కరణగా చెబుతున్నారు.

అరేబియా సముద్రంలో కొత్త ఫిష్ గుర్తింపు

Advertisement

కొచ్చిలోని ఐసీఏఆర్-ICAR-సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-CMFRI పరిశోధకులు అద్భుతాన్ని సాధించారు. కొత్త రకం చేపకు Cyttopsis indica అనే సైంటిఫిక్ పేరు పెట్టారు. సాధారణంగా ఇండియన్ జలాల్లో డోరీ చేపగా పిలుస్తారు. 350 నుంచి 500 మీటర్ల మధ్య లోతులో ఈ రకం చేప చక్కర్లు కొడుతోంది.

ముఖ్యంగా కేరళ తీరం సమీపంలోని తూర్పు లక్షద్వీప్ సముద్రపు మధ్యలో ఇది కనిపించింది. కొల్లంలోని శక్తి కులంగర ఫిషింగ్ హార్బర్‌లో లోతైన సముద్రపు ట్రావెల్ ల్యాండింగ్‌ల నుండి సేకరించిన ఆరు నమూనాల ఆధారంగా ఈ ఆవిష్కరణ జరిగింది. చూడటానికి డ్రై షిప్ మాదిరిగా కనిపిస్తుంది. కాస్త పొట్టిగా, చూస్తే మనుషులను మింగేటట్టుగా కనిపిస్తుంది.

Advertisement

కేరళం తీరంలో బయపడిన డోరీ ఫిష్.. కొత్త ఔషధాల తయారీకి

గతంలో హిందూ మహాసముద్రంలో డోరీ చేపను సైటోప్సిస్ రోసియాగా గుర్తించారని ఆ సంస్థ తెలిపింది. ఆ తర్వాత అట్లాంటిక్ మహాసముద్రానికి పరిమితమైందని భావించారు. చివరకు భారతదేశంలో దాని నమూనాలు బయటపడినట్టు తాజా అధ్యయనం నిర్ధారించింది. ఈ చేపను మరో జాతిగా గతంలో గుర్తించారు.

టాక్సనమిక్ అధ్యయనం DNA విశ్లేషణ ద్వారా కొత్త జాతి చేపగా నిరూపించారు. దీనిద్వారా అరేబియా సముద్రం రకరకాల చేపలు, జలచరాలకు కేరాఫ్‌గా ఉందని తేలిపోయింది. CMFRI సైంటిస్టుల బృందం డా.ఆర్. రతీష్ నాయకత్వంలో పరిశోధన చేపట్టింది. టీమ్ సభ్యులు లోతైన సముద్ర పరిశోధనలు చేసి నమూనాలను సేకరించారు.

ఇలాంటి సముద్ర జీవులను కనుక్కోవడం ద్వారా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. సముద్రంపై ఉండే చేపల కంటే లోతుల్లో జీవించే జీవులు కఠినమైన పరిస్థితుల మధ్య జీవిస్తాయి. వెలుతురు లేకపోవడం, ఆహారం లేకపోయినా నెట్టుకుంటూ వచ్చేస్తాయి.

ALSO READ: దీదీకి భారీ ఎదురు దెబ్బ.. అత్యంత ఆప్తురాలి రాజీనామా.. రెబల్ నేతతో కీలక భేటి!

ఉష్ణోగ్రత లేకుండా బతకడం చాలా కష్టమని, వాటిని అన్వేషించడం వల్ల అవి ఎలా బతుకుతున్నాయో తెలుసుకోవచ్చని చెబుతున్నారు. వాటి జీవ వైవిధ్యాన్ని తెలుసుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. భవిష్యత్తులో వీటి ద్వారా కొత్త ఔషధాలను తయారు చెయ్యవచ్చని, లోతుల్లో ఉండే చేపలు ఆహార వనరులకు ఆధారం కాగలవని అంచనా వేస్తున్నారు.

సముద్ర పర్యావరణను అర్థం చేసుకోవడానికి ఈ తరహా చేపలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. కొన్ని రకాల చేపలు మనుషులకు విషపూరితం కాగలవు, అవి మనుషులపై దాడి చెయ్యగలవని చెబుతున్నారు. అలాంటి చేపలు మన తీర ప్రాంతాల్లో కనిపిస్తే అలర్ట్ చేస్తారు పరిశోధకులు. దీనివల్ల మత్స్యకారులు ఆయా చేపలతో జాగ్రత్తగా ఉండవచ్చు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×