E-Paper
Advertisement

నీట్ వివాదంలో బిగ్ ట్విస్ట్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

నీట్ వివాదంలో బిగ్ ట్విస్ట్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
Advertisement

Dharmendra Pradhan: నీట్ పేపర్ లీక్ వివాదంలో నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులతో మూడో విడతగా కేంద్రం చర్చలు జరపనున్న నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. కాగా, నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా సీజేపీ, విద్యార్థులు దిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

రాజీనామాకు సంబంధించిన పోస్టులో ధర్మేంద్ర ప్రధాన్ కీలక అంశాలను ప్రస్తావించారు. విద్యార్థులు, విద్యా వ్యవస్థ కోసం తాను చేసిన కృషి గురించి పంచుకున్నారు. 4 దశాబ్దాలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు విద్యా సంస్కరణలకు తాను అంకితమైనట్లు చెప్పారు. దృఢమైన విద్యావ్యవస్థే దేశానికి బలమైన పునాది అని తాను ఎల్లప్పుడు నమ్ముతానని పేర్కొన్నారు. అటు యువత ఆకాంక్షలు, భావాలను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని తెలిపారు. దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ధర్మేంద్ర ప్రధాన్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

మరోవైపు నీట్ పరీక్ష పేపర్ లీక్ కు సంబంధించిన అంశాలను సైతం తన పోస్ట్ లో ప్రధాన్ ప్రస్తావించారు. 2026 మే 3న జరిగిన నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు బయటపడ్డాయని గుర్తు చేశారు. కేంద్రం దీనిని సుమోటాగా స్వీకరించి.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. అంతేకాకుండా ఆ పరీక్షను రద్దు చేసి.. తిరిగి పారదర్శకంగా మళ్లీ నీట్ ఎగ్జామ్ ను నిర్వహించినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి సీబీటీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) విధానంలో పరీక్ష నిర్వహించాలని కూడా నిర్ణయించినట్లు చెప్పారు.

Advertisement

అటు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సహకారంతో జూన్ 21న నీట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొచ్చారు. పరీక్షల మాఫియా వల్ల ఏ ప్రతిభగల విద్యార్థి నష్టపోకూడదన్నది తన సంకల్పమని తెలియజేశారు. ఈ క్రమంలోనే జూలై 16న ప్రకటించిన నీట్ యూజీ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. పేద నేపథ్యాల నుండి వచ్చిన అనేక ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా ఈ పరీక్షల్లో విజయం సాధించారన్నారు. అయినప్పటికీ బాధ్యాతాయుత పదవుల్లో ఉన్న కొందరు విద్యార్థులను తప్పుదోవ పట్టించారని అసహనం వ్యక్తం చేశారు. ఇది తనను చాలా బాధపెట్టిందన్నారు.

Also Read: “అయ్యగారు” అంటూ పార్టీల్లో ఆటపట్టించేవారు.. అఖిల్ షాకింగ్ కామెంట్స్!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×