E-Paper
Advertisement

రాజీనామా సరిపోదు.. ఆ డిమాండ్స్ మిగిలే ఉన్నాయ్.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం!

రాజీనామా సరిపోదు.. ఆ డిమాండ్స్ మిగిలే ఉన్నాయ్.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం!
Advertisement

CJP Demands: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో దిల్లీలోని జంతర్ మంతర్ సంబురాలు మిన్నంటాయి. దీనిని ప్రజాస్వామ్య విజయంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అభివర్ణించారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థులు సాగించిన నిరంతర పోరాటం ఫలితంగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని పేర్కొన్నారు.

శాంతియుతంగా సాగిన ఈ ప్రజాస్వామ్య ప్రతిఘటన.. తమ శక్తి ఏంటో చూపించిందని అభిజీత్ అన్నారు. అధికారంలో ఉన్న వారిని సామాన్య పౌరులు సైతం జవాబుదారీగా మార్చగలరని ఈ ఉద్యమం నిరూపించిందని నొక్కి చెప్పారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ప్రభుత్వానికి భయపడకుండా ధైర్యంగా పోరాడితే ఎవరినైనా రాజీనామా చేయించగలం అని చెప్పేందుకు ఇదే నిదర్శనం’ అని నిరసనకారులను ఉద్దేశిస్తూ  అభిజిత్ వ్యాఖ్యానించారు.

Advertisement

Also Read: లవర్‌తో తోటి ఉద్యోగి ఫ్రెండ్ షిప్.. కట్ చేస్తే దారుణ హత్య.. ఇలా ఉన్నారేంట్రా బాబు!

అయితే విద్యామంత్రి రాజీనామాతో సరిపోదని అభిజీత్ దీప్కే అభిప్రాయపడ్డారు. తమ రెండు డిమాండ్లు ఇంకా అలాగే ఉన్నాయని పేర్కొన్నారు. రాజీనామా చేశారు సరే.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందాలి కదా అంటూ నిరసనకారుల్లో ఆవేశాన్ని రగిలించారు. ఆ కుటుంబాలన్నీ రూ. కోటి పరిహారానికి అర్హులని పేర్కొన్నారు. ఇక రెండో డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ.. జులై 20వ తేదీ నిరసనల్లో గూండాల్లా ప్రవర్తించిన పోలీసు సిబ్బందిపై చర్య తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఆ రోజున విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారు.

Advertisement

Also Read: BSNL మరో దుమ్మురేపే ప్లాన్.. 700GB డేటా, ఫ్రీ కాల్స్, ఓటీటీ.. 6 నెలలు పండగే!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×