E-Paper
Advertisement

Fadnavis Quit As Deputy CM: బీజేపీ కుటిల రాజకీయాలు, డిప్యూటీ సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా, కాకపోతే..

Fadnavis Quit As Deputy CM: బీజేపీ కుటిల రాజకీయాలు, డిప్యూటీ సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా, కాకపోతే..
Advertisement

Fadnavis Quit As Deputy CM(Telugu news headlines today): సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర బీజేపీకి షాకిచ్చాయి. ఈసారి ఎక్కువ సీట్లు గెలవాలని వేసిన స్కెచ్ రివర్స్ అయ్యింది. దాని ఫలితంగా డిప్యూటీ సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశారు. మహారాష్ట్రలో తమ పార్టీకి తక్కువ సీట్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై పార్టీ కోసం తాను పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనికి కారణం బీజేపీ కుటిల రాజకీయాలేనా అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

మహారాష్ట్రలో బీజేపీ చాలా బలంగా ఉండేది. అధికారం కోసం అక్కడి శివసేన, ఎన్సీపీ పార్టీలను నిట్ట నిలువునా చీల్చేసింది బీజేపీ. ఆ పార్టీలకు గుర్తులు దక్కకుండా చేసింది. చివరకు ఆ రాష్ట్రంలో అధికారం లోకి వచ్చింది బీజేపీ కూటమి. మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయాలను గమనించిన ఓటర్లు ఈసారి ఊహించని ఝలక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో 23 సీట్లు గెలుచుకున్న బీజేపీ, ఈసారి 9 సీట్లకు పరిమితం చేశారు. ఇక షిండే పార్టీకి ఏడు స్థానాలు రాగా, ఎన్సీపీ అజిత్ వర్గానికి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.

Advertisement

ఎప్పుడు లేని విధంగా ఈసారి కాంగ్రెస్- ఉద్దవ్-పవార్ వర్గాలు కలిసి మహా వికాస్ అఘాడీగా పేరుతో బరిలోకి దిగాయి. మొత్తం 48 సీట్లకు గాను 29 స్థానాలను గెలుచుకున్నాయి. సాంగ్లీ నుంచి కాంగ్రెస్ రెబల్ విశాల్ పాటిల్ విజయం సాధించారు. ఎన్డీఏ కూటమి 17 స్థానాలకు పరిమితమైంది.

ALSO READ: ఇండియా కూటమిలోకి చంద్రబాబు రావడం ఖాయం, ఎందుకంటే..

Advertisement

ప్రాంతీయ పార్టీలను డ్యామేజ్ చేద్దారని భావించింది బీజేపీ. చివరకు ఫలితాలు రివర్స్ కావడంతో నైతిక బాధ్యత వహించి డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. కానీ కొంతమంది బీజేపీ నేతలు మాత్రం మోదీ మంత్రివర్గంలో ఫడ్నవీస్‌కు ఛాన్స్ దక్కిందని, ఈ క్రమంలోనే రాజీనామా చేస్తారనే అంటున్నవాళ్లూ లేకపోలేదు. మహారాష్ట్రలో ఓటర్లు ఇచ్చిన ఫలితాలతో బీజేపీ తన తప్పు తెలుసుకుంటుందా? లేదా చూడాలి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×