// // West Bengal: బెంగాల్‌‌లో ఏం జరుగుతోంది? మంటల్లో 4 వేల ఈవీఎంలు, ఎవరి పని? -->
E-Paper
Advertisement

బెంగాల్‌‌లో ఏం జరుగుతోంది? బూడిదైన 4 వేల ఈవీఎంలు, ఎవరి పని? నివేదిక కోరిన సీఈసీ

బెంగాల్‌‌లో ఏం జరుగుతోంది? బూడిదైన 4 వేల ఈవీఎంలు,  ఎవరి పని? నివేదిక కోరిన సీఈసీ
Advertisement

West Bengal: బెంగాల్‌లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు- EVM భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 వేల ఈవీఎం మిషన్లు కాలి బూడిదయ్యాయి. తాజాగా ఘటనతో రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి.

బెంగాల్‌లో షాకింగ్ ఘటన.. ప్రభుత్వ భవనంలో భారీ అగ్నిప్రమాదం

Advertisement

అంతేకాదు అధికారులు, స్థానిక యంత్రాంగం ఉలిక్కి పడింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే వేల సంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్, ఇతర పరికరాలు మంటల్లో కాలి బూడదయ్యాయి. ఎన్నికల సామగ్రి భద్రపరిచే అత్యంత సురక్షితమైన ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దక్షిణ కోల్‌కతాలోని అలీపూర్ ప్రాంతంలో తొమ్మిది అంతస్తుల భవనంలో ప్రమాదం జరిగింది. ఈ భవనంలో ఇతర విభాగాలతో పాటు దక్షిణ 24 పరగణాల జిల్లా పరిషత్ కార్యాలయం ఉంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాలిపోయిన ఈవీఎంలను 10 నియోజకవర్గాల్లో ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అగ్నిమాపక, అత్యవసర సేవల శాఖ సహాయ మంత్రి చౌదరి తెలిపారు.

Advertisement

కాలి బూడిదైన 4 వేల ఈవీఎంలు.. నివేదిక కోరిన సీఈసీ?

ఘటనా స్థలాన్ని సందర్శించిన ఆయన, సాధారణ అగ్నిప్రమాదంలా కనిపించడం లేదన్నారు. నాలుగు, ఐదు, ఆరు అంతస్తులకు నష్టం కలగకుండా ఏకంగా మంటలు ఏడు, ఎనిమిది అంతస్తులకు ఎలా చేరింది? ఈ మొత్తం విషయంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ప్రమాదవ శాత్తూ ఈ ఘటన జరిగిందా? లేకుంటే కావాలనే ఎవరైనా చేశారా? దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా? ఇవే అనుమానాలు వెంటాడుతున్నాయి.

కేసు నమోదు చేసిన పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు భారీ సంఖ్యలో ఈవీఎంలు కాలిపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ బృందం నమూనాలను సేకరించే పనిలో పడింది. వివిధ అంతస్తులకు మంటలు ఏ విధంగా వ్యాపించిందనే దానిపై అధికారులు దృష్టి సారించారు.

ALSO READ: స్కూల్లో రైడ్.. రూ.కోటి నగదు, మద్యం, కం*డోమ్స్ లభ్యం.. పోలీసులకే మైండ్ బ్లాక్!

భవనం ప్రాంగణం చుట్టూ పోలీసులు నిఘా పెంచారు. ఈ ఘటన అధికార-విపక్షాల మధ్య మాటలయుద్ధం ముదిరే అవకాశముందని చెబుతున్నారు. కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ విధ్వంస అవకాశాన్ని కొట్టి పారేయకూడదన్నారు. ప్రమాదం ప్రణాళికాబద్ధమైన చర్యగా ఆరోపించారు.

ఆరోపణలకు మద్దతు ఇచ్చే ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు బయటకురాలేదు. ఫోరెన్సిక్ విభాగం సేకరించిన ఆధారాలతో నిర్ధారణలకు వస్తామని అధికారులు తెలిపారు. భవనంలో ఉన్న ప్రభుత్వ రికార్డులు, మౌలిక సదుపాయాలు, భద్రతా వ్యవస్థలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×