E-Paper
Advertisement

Delhi Accident Video: రీల్స్ చేస్తూ డ్రైవింగ్.. దిల్లీ యాక్సిడెంట్ కేసులో.. వెలుగులోకి షాకింగ్ వీడియో

Delhi Accident Video: రీల్స్ చేస్తూ డ్రైవింగ్.. దిల్లీ యాక్సిడెంట్ కేసులో.. వెలుగులోకి షాకింగ్ వీడియో
Advertisement

Delhi Accident Video: దిల్లీలో గత వారం జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. 17 ఏళ్ల బాలుడు కారుతో ఢీకొట్టడంతో సాహిల్ (23) అనే యువకుడు మృతి చెందాడు. తాజాగా వెలుగు చూసిన వీడియోలో మైనర్ బాలుడు రీల్స్ చేస్తూ డ్రైవింగ్ చేస్తున్నట్లు బయటపడింది. యాక్సిడెంట్ కు కొద్దిసేపు ముందు ఈ వీడియోను రికార్డు చేసినట్లు సమాచారం. దీంతో సాహిల్ తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

దిల్లీలోని ద్వారకా సౌత్ పోలీసు స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సాహిల్ అనే యువకుడు మరణించడంతో పోలీసులు కేసు నమోదు చేసి.. కారు నడుపుతున్న 17 ఏళ్ల మైనర్ ను అరెస్టు చేశారు. అయితే అతడికి పరీక్షలు ఉండటంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ఓ వీడియో బయటకు రావడం తీవ్ర చర్చకు దారి తీసింది.

వైరల్ వీడియోలో ఏముందంటే?

Advertisement

వైరల్ అవుతున్న వీడియోను డ్రైవర్ పక్కన సీటులో కూర్చున్న యువతి (సోదరిగా భావిస్తున్నారు) చిత్రీకరించినట్లుగా కనిపిస్తోంది. డివైడర్ లేని రోడ్డుపై కారు వేగంగా దూసుకెళ్లడం గమనించవచ్చు. కొద్దిసేపటికే బైక్ పై ముందు వెళ్తున్న సాహిల్ ను కారు బలంగా ఢీకొట్టడం చూడవచ్చు. తాజా వీడియోపై సాహిల్ తల్లి ఇన్నా మకాన్ మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యకం చేశారు. తన బిడ్డను కారుతో ఢీకొట్టడానికి ముందు.. మైనర్ తన సోదరితో కలిసి రీల్స్ చేశాడని ఆమె ఆరోపించారు. అతడు చాలా వేగంగా కారు నడపడాన్ని వీడియోలో చూడవచ్చన్నారు.

Advertisement

Also Read: Air Cooler vs Air Conditioner: సమ్మర్‌లో ఏసీ కొనాలా? కూలర్ కొనాలా? మీకు ఏది సరైనది!

మృతుడి తల్లి ఆగ్రహం

సింగిల్ మదర్ గా తన బిడ్డను పెంచి పెద్ద చేశానని ఇన్నా మకాన్ వాపోయారు. తనకు న్యాయం జరిగేలా మద్దతు ఇవ్వాలని నెటిజన్లు, స్థానికులను ఆమె కోరారు. కారుతో ఢీకొట్టిన తర్వాత కూడా బ్రేకులు వేయకపోవడం వల్లే తన బిడ్డకు తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయాడాని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన అనంతరం నిందితుడ్ని అరెస్ట్ చేసి జువెనైల్ అబ్జర్వేషన్ కు పోలీసులు తరలించారు. పదో తరగతి బోర్డు పరీక్షలు ఉంటడంతో కోర్టు అతడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Front Load vs Top Load Price: రెండింటిలో ఏ వాషింగ్ మిషన్ ధర ఎక్కువ? అందుకు గల కారణాలేంటి?

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×