E-Paper
Advertisement

Delhi Metro: దిల్లీ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. భద్రతా కారణాలతో 16 స్టేషన్లు మూసివేత!

Delhi Metro: దిల్లీ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. భద్రతా కారణాలతో 16 స్టేషన్లు మూసివేత!
Advertisement

Delhi Metro: రాజధాని దిల్లీలో బుధవారం ఉదయం మెట్రో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఎదురైంది. భద్రతా కారణాల దృష్ట్యా నగరం పరిధిలోని 16 కీలక మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా అధికారికంగా వెల్లడించింది.

మూతపడిన కీలక స్టేషన్లు ఇవే

Advertisement

నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రధాన మార్గాల్లోని స్టేషన్లను అధికారులు బంద్ చేశారు. రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, మండీ హౌస్, ఐటీఓ, ఖాన్ మార్కెట్‌లతో పాటు లోక్ కళ్యాణ్ మార్గ్, దిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, జోర్ బాగ్, శివాజీ స్టేడియం వంటి స్టేషన్లు మూతపడిన వాటిలో ఉన్నాయి. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ స్టేషన్లు మూసే ఉంటాయని డీఎంఆర్‌సీ స్పష్టం చేసింది.

ఇంటర్ ఛేంజ్‌కు వెసులుబాటు

Advertisement

స్టేషన్లు మూసివేసినప్పటికీ, ఇతర లైన్లకు మారే ప్రయాణికులకు డీఎంఆర్‌సీ కొంత ఉపశమనం అందించింది. రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటీరియట్ స్టేషన్లలో ఒక లైన్ నుంచి మరొక లైన్‌కు మారే ఇంటర్ ఛేంజ్ సౌకర్యం యధావిధిగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ స్టేషన్ల నుంచి బయటకు వెళ్లడం , లోపలికి రావడం మాత్రం కుదరదు.

నిరసనల వల్లే ఈ నిర్ణయం

దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదివరకు జులై 20న నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ సమయంలో కూడా ముందస్తు జాగ్రత్తగా పలు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే.

రద్దీ సమయంలో ఉన్నపళంగా మెట్రో సేవలు నిలిచిపోవడంతో కార్యాలయాలకు, ఇతర పనులకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్టేషన్ల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చింది.

Also Read: మేడ్చల్లో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ హైటెన్షన్.. రాజీనామా చేయాలని డిమాండ్!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×