E-Paper
Advertisement

Delhi News: ఢిల్లీలో ఉద్రిక్తత.. హిడ్మాకు మద్దతుగా నిరసనలు

Delhi News: ఢిల్లీలో ఉద్రిక్తత.. హిడ్మాకు మద్దతుగా నిరసనలు
Advertisement

Delhi News: దేశ రాజధాని ఢిల్లీలో వాయి కాలుష్యానికి వ్యతిరేకంగా ఇండియా గేటు వద్ద పలువురు నిరసనలు చేపట్టారు. అయితే ఈ నిరసనల్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత మాద్వి హిడ్మా ఫోటోలు, ఆయనకు అనుకూలంగా నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో పలువురిపై ఢిల్లీలో కేసు నమోదు చేశారు.

ఢిల్లీలో రోజు రోజుకి పెరుగుతున్న వాయి కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ చేపట్టాలని ఆదివారం నాడు పలువురు ఇండియా గేటు వద్ద నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇటీవల ఎన్ కౌంటర్ లో ప్రమాణాలు కోల్పోయిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు మద్ధతుగా ప్రకార్డులు, ఫోటోలు దర్శనమిచ్చాయి.

Advertisement

బిర్సా ముండా నుండి మాద్వి హిడ్మా వరకు మన అడవులు, పర్యావరణంపై పోరాటం సాగింది. మన బిడ్డలను మనమో చంపుకోవడం ఏంటి అని ప్రశ్నల వర్షం కురిపించారు. జిల్, జంగిల్ జమీన్ కోసం పోరాటం కొనసాగుతోంది, మాద్వీ హిద్మా అమర్ రహే” (మాద్వీ హిద్మా వర్థిల్లాలి) అంటూ పోస్టర్‌ని ప్రదర్శించి నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు చేరుకొని నిరసన కారులను చెదరగొట్టారు. దీంతో పోలీసు సిబ్బందిపై చిల్లీ స్ప్రేతో దాడి చేశారు.

భద్రతా దళాలు, పౌరులపై కనీసం 26 సాయుధ దాడులకు కారణమైన హిడ్మా.. నవంబర్ 18న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. 2010లో దంతేవాడలో జరిగిన దాడిలో 76 మంది CRPF సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 2013లో జిరామ్ ఘాటిలో జరిగిన ఆకస్మిక దాడిలో కాంగ్రెస్ అగ్ర నాయకులు సహా 27 మంది మరణించారు. 2021లో సుక్మా-బీజాపూర్ ఆకస్మిక దాడిలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. దీనిలో 22 మంది భద్రతా సిబ్బంది మరణించారు.

Advertisement

Also Read: 53వ సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణ స్వీకారం

హింసకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 22 మందిని అరెస్టు చేశారు. కాగా మావోయిస్టు నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఇండియా గేట్ వద్ద అలాంటి నినాదాలు చేసిన వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×