E-Paper
Advertisement

టెలిగ్రామ్‌కు బిగ్ షాక్​.. కేంద్రాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు.. ఏమన్నదంటే?

టెలిగ్రామ్‌కు బిగ్ షాక్​.. కేంద్రాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు.. ఏమన్నదంటే?
Advertisement

Telegram Ban: టెలిగ్రామ్​ ప్లాట్​ ఫామ్ కు దిల్లీ హైకోర్టు షాకిచ్చింది. తాత్కాలికంగా టెలిగ్రామ్​ ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్​ వేసిన పిటిషన్​ ను కొట్టివేసింది.

కొద్ది రోజుల క్రితం జరిగిన నీట్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకైన విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే విచారణలో టెలిగ్రామ్​ యాప్​ ద్వారా ప్రశ్నాపత్రాలు సర్క్యులేట్​ అయినట్టుగా వెల్లడైంది. పేపర్ లీక్​ అయిన నేపథ్యంలో ఎన్టీఏ నీట్​ రీ ఎగ్జామ్​ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఈ క్రమంలోనే టెలిగ్రామ్​ ప్లాట్​ ఫామ్​ ను తాత్కాలికంగా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

అయితే దీనిని సవాల్​ చేస్తూ టెలిగ్రామ్ దిల్లీ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన దిల్లీ హైకోర్టు కౌంటర్​ అఫిడవిట్​ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కౌంటర్​ అఫిడవిట్​ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం దాంట్లో టెలిగ్రామ్​ యాప్​ పై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది ఓ డార్క్​ వెబ్​ సైట్​ లా మారిందని పేర్కొంది. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలతోపాటు అన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, సైబర్ క్రిమినల్స్​ కు టెలిగ్రామ్​ ఓ వేదికగా మారిందని తెలిపింది.

కాగా శుక్రవారం దిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్​ తేజస్​ కారియా టెలిగ్రామ్​ దాఖలు చేసిన పిటిషన్​ పై విచారణ జరిపారు. కేంద్రం తరపున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా వాదనలు వినిపిస్తూ అక్రమ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి టెలిగ్రామ్​ వేదికగా మారిందని చెప్పారు. అనుమానాస్పద ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని గతంలో పలుమార్లు టెలిగ్రామ్ కు సూచించామన్నారు . అయినా తగిన చర్యలు తీసుకోవటంలో టెలిగ్రామ్​ నిర్వాహకులు విఫలమైనట్టు చెప్పారు.

Advertisement

Also Read: ఇష్టపడి చదవండి.. దేశానికే ఆదర్శం కాండి.. విద్యార్థులకు సీఎం రేవంత్ పిలుపు!

అటు టెలిగ్రామ్​ తరపున సీనియర్​ న్యాయవాది ధ్రువ్ మెహతా వాదనలు వినిపిస్తూ నిషేధం విధించటాన్ని కేంద్రం సమర్థించుకోజాలదని చెప్పారు. సంబంధిత కంటెంట్​ ను మాత్రమే బ్లాక్​ చేయకుండా మొత్తం యాప్ ను ఎందుకు నిషేధించారో వివరించలేదన్నారు. కేవలం నీట్​ పరీక్షతో దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు ముప్పు ఏర్పడుతుందా? అని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు కేంద్రం వాదనలను సమర్థించింది. సెక్షన్​ 69ఏ ప్రకారం ఓ డిజిటల్​ వేదికను నిషేధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. నిషేధాన్ని ఎత్తి వేయాలని కోరుతూ టెలిగ్రామ్​ దాఖలు చేసిన పిటిషన్​ ను కొట్టివేసింది. దీంతో ఈనెల 22వ తేదీ వరకు టెలిగ్రామ్​ పై కేంద్రం విధించిన నిషేధం కొనసాగనుంది.

Also Read: టెలిగ్రామ్‌పై కేంద్రం బ్యాన్.. ప్రత్యామ్నాయ 5 యాప్స్ ఇవే.. సేఫ్ అండ్ సూపర్!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×