E-Paper
Advertisement

మమ్మల్ని లాగొద్దు.. తక్షణమే విచారించలేం.. బొద్దింకలకు దిల్లీ హైకోర్టు ఝలక్!

మమ్మల్ని లాగొద్దు.. తక్షణమే విచారించలేం.. బొద్దింకలకు దిల్లీ హైకోర్టు ఝలక్!
Advertisement

Delhi High Court: కేంద్రానికి వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) చేపట్టిన ‘ఛలో పార్లమెంటు’ మార్చ్ సోమవారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ సైతం చేశారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ దిల్లీ హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ పట్టుబట్టారు. ఈ క్రమంలో దిల్లీ హైకోర్టు సీజేపీకి ఊహించని ఝలక్ ఇచ్చింది.

‘మమ్మల్ని లాగొద్దు’

ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పిటిషనర్ కీలక ఆరోపణలు చేశారు. నిరసనకారులపై మితిమీరిన బలప్రయోగం చేశారని పేర్కొన్నారు. కాబట్టి వెంటనే విచారణకు స్వీకరించాలని కోరారు. ఈ అభ్యర్థనపై దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ విషయంలో కోర్టును లాగొద్దు’ అని అన్నారు. బుధవారం విచారణ జాబితాలో ఈ కేసును చేరుస్తామని స్పష్టం చేశారు.

నిరసనల్లో 178 మందికి గాయాలు

Advertisement

ఇదిలా ఉంటే సోమవారం దిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకు CJP ఆధ్వర్యంలోని ఆందోళనకారులు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. యువతను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో నిరసనకారుల్లోన కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. మెుత్తంగా సోమవారం చోటుచేసుకున్న ఘర్షణల్లో 178 మంది గాయపడ్డారు. అందులో అత్యధికంగా 118 మంది పోలీసు సిబ్బంది ఉండటం గమనార్హం. మరోవైపు నిరసనకారుల్లో 60 మందికి గాయాలయ్యాయి.

Also Read: Airtel యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన టెలికాం దిగ్గజం

హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Advertisement

అంతకుముందు దిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ సోనమ్ వాంగ్ చుక్ కు సంబంధించి కీలక తీర్పు ఇచ్చింది. సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలన్న వాంగ్ చుక్ భార్య గీతాంజలి అభ్యర్థిని హైకోర్టు మన్నించింది. దిల్లీలోని మెదాంత ప్రైవేటు ఆస్పత్రికి తరలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు వాంగ్ చుక్‏కు చేసిన ట్రీట్మెంట్ వివరాలు, ఇతర రిపోర్ట్స్ అన్ని మెదాంత ఆసుపత్రికి అందజేయాలని సఫ్దర్ జంగ్ హాస్పిటల్ వైద్యులను కోర్టు ఆదేశించింది.

Also Read: పాత బంగ్లాలో అర్ధరాత్రి విడిది.. దెయ్యం లేదని నిరూపిస్తే.. రూ.52 వేలు మీవే!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×