E-Paper
Advertisement

ఢిల్లీలో హైడ్రామా.. ఎయిర్‌పోర్టులోనే ‘సీజేపీ’ అధినేత అరెస్ట్? రంగంలోకి పారామిలటరీ!

ఢిల్లీలో హైడ్రామా.. ఎయిర్‌పోర్టులోనే ‘సీజేపీ’ అధినేత అరెస్ట్? రంగంలోకి పారామిలటరీ!
Advertisement

CJP Protests: నీట్ (NEET), CBSE పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారంపై ఢిల్లీలో రాజకీయ వేడి రాజుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నేడు జంతర్‌మంతర్ వద్ద భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది.

నిఘా నీడలో ఢిల్లీ.. రంగంలోకి బలగాలు

Advertisement

ఈ ఆందోళనలకు పోలీసులు ముందస్తు అనుమతి నిరాకరించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు, పారామిలటరీ బలగాలు అప్రమత్తమయ్యాయి. జంతర్‌మంతర్ పరిసరాల్లో బారికేడ్లు, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి ఇంటెలిజెన్స్ వర్గాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, సరిహద్దుల వద్ద వెయ్యి మందికి పైగా పోలీసులను మోహరించారు.

అరెస్టుకు సిద్ధమైన వ్యవస్థాపకుడు

Advertisement

ఈ ఉద్యమానికి ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు మద్దతు ప్రకటించారు. కాగా, అమెరికా నుంచి మరికాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్న సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కేను ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే, పోలీసులు అరెస్ట్ చేసినా రాజ్యాంగబద్ధంగా తన నిరసనను కొనసాగిస్తానని, శాంతియుత పోరాటంలో ప్రజలంతా పాల్గొనాలని అభిజిత్ పిలుపునిచ్చారు.

హైకోర్టు కీలక నిర్ణయం

మరోవైపు, ఈ ఆందోళనల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతానికి ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది.

Also Read: మద్యం బాటిళ్ల లారీ బోల్తా.. ఎగబడ్డ జనం

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×