E-Paper
Advertisement

Delhi Liquor Case: కేజ్రీవాల్ పిటిషన్‌పై రేపు తీర్పు వెలువరించనున్న ఢిల్లీ హైకోర్టు..!

Delhi Liquor Case: కేజ్రీవాల్ పిటిషన్‌పై రేపు తీర్పు వెలువరించనున్న ఢిల్లీ హైకోర్టు..!
Advertisement
Delhi High Court To Pronounce Verdict on Kejriwal Petition
Delhi High Court To Pronounce Verdict on Kejriwal Petition

Delhi High Court To Pronounce Verdict on Kejriwal Petition: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది.

హైకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన జాబితా ప్రకారం, జస్టిస్ స్వర్ణ కాంత శర్మ మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఉత్తర్వులు జారీ చేస్తారు.

Advertisement

తన అరెస్ట్‌తో పాటు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో తన తదుపరి రిమాండ్‌ను కూడా కేజ్రీవాల్ సవాలు చేశారు. అనంతరం కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. కేజ్రీవాల్‌ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. AAP జాతీయ కన్వీనర్ ఈడీ తనని అరెస్టు చేసిన సమయంపై ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా, నిష్పాక్షికమైన ఎన్నికలు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్‌తో సహా రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి ఇది విరుద్ధంగా ఉందని అన్నారు.

ఈడీ ఈ అభ్యర్థనను వ్యతిరేకించింది. కేజ్రీవాల్‌కు, “ఆమ్ ఆద్మీ”కి సమానంగా చట్టం వర్తింపచేసామన్నది. రాబోయే ఎన్నికల కారణంగా అరెస్టు నుంచి విముక్తి పొందలేరని వాదించింది.

Advertisement

Also Read: కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించాలంటూ పిటిషన్.. భారీ షాక్ ఇచ్చిన హైకోర్టు

ఫెడరల్ యాంటీ మనీలాండరింగ్ ఏజెన్సీ బలవంతపు చర్య నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించడంతో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఈడీ కస్టడీ గడువు ముగియడంతో ఏప్రిల్ 1న ట్రయల్ కోర్టులో హాజరుపరచగా, ఈ కేసులో కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×