E-Paper
Advertisement

Arvind Kejriwal: ఈవీఎంలను మార్చేందుకు కుట్ర.. అందుకే ఫేక్ ఎగ్జిట్ పోల్స్: కేజ్రీవాల్

Arvind Kejriwal: ఈవీఎంలను మార్చేందుకు కుట్ర.. అందుకే ఫేక్ ఎగ్జిట్ పోల్స్: కేజ్రీవాల్
Advertisement

Arvind Kejriwal Comments On Exit Polls: ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం జైలులో సరెండర్‌కు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యకర్తను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. ఈవీఎంలను తారుమారు చేసేందుకే ఫలితాలకు మూడు రోజుల ముందుగా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారని విమర్శించారు. ఈవీఎంలను మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

2024 లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ శనివారం వెలువడ్డాయి. దీంతో బీజేపీకి అనుకూలంగా ఏకపక్షంగా ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయని కేజ్రీవాల్ ఆరోపించారు. కౌంటింగ్‌కు ముందు ఎగ్జిట్ పోల్స్ ఎందుకు వెల్లడించాల్సి వచ్చిందన్నారు. బీజేపీ కుట్రలో ఇది కూడా ఓ భాగమే అని మండిపడ్డారు. ఈవీఎంలను మార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్డీఏ కూటమికి 350 పైగా స్థానాలు వస్తాయనడంపై  ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: మోదీ మూడో సారి గెలిస్తే గుండు చేయించుకుంటా: సోమనాథ్

కాగా, లోక్ సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న విడుదల కానున్నాయి. అయితే, ఇప్పటి ఇటు బీజేపీ, అటు ఇండియా కూటమి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమకే ఎక్కువ సీట్లు రాబోతున్నాయి.. తామే అధికారంలోకి రాబోతున్నామంటూ పేర్కొన్నాయి. ఎల్లుండి రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఆరోజు తెలియనున్నది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అధికారం దక్కించుకుంటుంది అనేది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ను ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అటు రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన రిజల్ట్ సరికాదు.. తామే అధికారంలోకి రాబోతున్నామంటూ ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×