E-Paper
Advertisement

Delhi Blast Case: ఢిల్లీ పేలుడు ఘటనలో మరొకరు అరెస్ట్.. ఉమర్‌తో ఎలాంటి సంబంధం ఉందంటే..!

Delhi Blast Case: ఢిల్లీ పేలుడు ఘటనలో మరొకరు అరెస్ట్.. ఉమర్‌తో ఎలాంటి సంబంధం ఉందంటే..!
Advertisement

Delhi Blast Case: ఢిల్లీ పేలుడుకు, మదర్సాకు ఉన్న లింక్స్‌పై దర్యాప్తు సంస్థలు ఆరాఢిల్లీ పేలుడు ఘటనలో మరొకరిని అరెస్ట్ చేశారు ఎన్‌ఐఏ అధికారులు. టెర్రరిస్టు ఉమర్ నబీకి హర్యానాలోని ధౌజ్ గ్రామంలో ఆశ్రయం ఇచ్చిన ఫరీదాబాద్ వాసి షోయబ్‌ను అరెస్ట్ చేశారు. ఎర్రకోట దగ్గర జరిగిన కారు బాంబు దాడికి ముందు టెర్రరిస్టు ఉమర్‌కు.. లాజిస్టికల్ సపోర్టు కూడా అందించినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు ఎన్‌ఐఏ అధికారులు.

ఢిల్లీ పేలుళ్ల కేసుకు ఫరీదాబాద్‌కు ఉన్న లింకులు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. తాజగా ఈ కేసులో ఒక అండర్ గ్రౌండ్ మదర్సాకు లింక్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దిల్లీ పేలుడు ఘటనలో ఉగ్ర డాక్టర్లకు అడ్డాగా మారిన అల్‌ఫలాహ్‌ యూనివర్సిటీ సమీపంలోఈ అండర్‌గ్రౌండ్‌ మదర్సాను గుర్తించారు. ఆ మదర్సా గోడలు ఏకంగా 4 నుంచి 5 అడుగుల మందంతో అసాధారణంగా ఉండటం అనుమానాలను మరింత పెంచుతోంది. ఆ మదర్సా ఇంకా నిర్మాణ దశలోనే ఉందని తెలుస్తోంది. మదర్సాలోని ఎక్కువ భాగం భూగర్భంలోనే ఉండగా, కేవలం మూడు అడుగుల నిర్మాణం మాత్రమే బయటకు కనిపించేలా ఉంది.

Advertisement

మొత్తం 200 యార్డుల స్థలంలో ఈ అండర్ గ్రౌండ్ మదర్సా నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం హర్యానా మౌల్వీ ఇష్తియాక్‌ పేరుతో రిజిస్టరై ఉంది. కానీ దీనికి సంబంధించిన నిధులు మాత్రం వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కేసులో అరెస్టైన ముజమ్మిల్ సమకూర్చారు. దీంతో ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసుకు.. ఈ మదర్సాకు ఉన్న సంబంధంపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.

Also Read: బాబు ఏడుపు.. రోడ్డుపై జగన్‌.. ఏపీలో AI రాజకీయం

Advertisement

ఉగ్రవాదానికి సంబంధించి ఈ మదర్సా ఒక ఆర్గనైజ్‌డ్ మాడ్యూల్ కావచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. దీంతో భూగర్భ నిర్మాణాన్ని ఎప్పుడు ప్లాన్ చేశారు, ఎవరు దీనిని రూపొందించారు, నిర్మాణ సామగ్రిని ఎక్కడ నుండి సేకరించారు మరియు ఇంత బలమైన అంతర్గత నిర్మాణం ఎందుకు నిర్మించారు అనే దానిపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. ఇది కేవలం మతపరమైన ప్రదేశమే కాకుండా రహస్య కార్యకలాపాల కేంద్రంగా కూడా ఉండొచ్చని అంటున్నారు. రెండ్రోజుల క్రితం డాక్టర్ ముజమ్మిల్‌తో కలిసి ఫరీదాబాద్‌కు చేరుకుంది ఎన్‌ఐఏ టీమ్. మదర్సాను తనిఖీ చేయడమే కాకుండా.. అల్-ఫలాహ్ యూనివర్సిటీకి.. దాంతో పాటూ అతడు బస చేసిన ఇంటికి కూడా తీసుకెళ్లి దర్యాప్తు చేశారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×