// // Delhi Pollution: ఢిల్లీలో భారీగా పెరిగిన గాలి కాలుష్యం. -->
E-Paper
Advertisement

Delhi Pollution: ఢిల్లీలో భారీగా పెరిగిన గాలి కాలుష్యం.. వాటిపై నిషేధం విధించిన ఢిల్లీ సర్కారు!

Delhi Pollution: ఢిల్లీలో భారీగా పెరిగిన గాలి కాలుష్యం.. వాటిపై నిషేధం విధించిన ఢిల్లీ సర్కారు!
Advertisement

Delhi Pollution: చలికాలంలో దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిని దాటి, గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోతుందన్న సంగతి తెలిసిందే. గత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అదుపు చేయలేకపోయిందని బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఢిల్లీలోని ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది.

ఢిల్లీలో గాలి కాలుష్యం భారీగా పెరిగడంతో గాలి నాణ్యత మరోసారి భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఢిల్లీలో మంగళవారం ఉదయం 400 మార్కును దాటడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3(GRAP 3) అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్దమైంది.

Advertisement

GRAP 3 ప్రకారం భూముల తవ్వకం, పైలింగ్, డ్రైనేజ్ పైపులైన్లు, విద్యుత్ కేబుల్స్ వేయడం, రెడ్ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్ల పనులను నిలిపివేయాల్సి ఉంటుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో నిర్మాణ , కూల్చివేత కార్యకలాపాలపై ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. ఢిల్లీలో , గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్ ,గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాల్లో BS-III పెట్రోల్ , BS-IV డీజిల్ LMV లను ఫోర్-వీలర్లు వాహనాలు నడపడాన్ని కమిషన్ నిషేధించింది.

Read Also: Delhi Car Blast: ఒక్కరిని కూడా వదిలిపెట్టం.. ఢిల్లీలో పేలుడు ఘటనపై మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

Advertisement

ఢిల్లీ మొత్తం AQI సోమవారం 362 నుండి మంగళవారం ఉదయం 11:30 గంటలకు 429కి పెరిగిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) రిపోర్టు వెల్లడించింది. ఈ సీజన్‌లో మొదటిసారిగా ఢిల్లీ నగర గాలి నాణ్యత ‘తీవ్రమైన’ స్థాయిలోకి వెళ్లింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ వ్యాప్తంగా 39 మనిటరింగ్ కేంద్రాలలో, 38 తీవ్ర కాలుష్య స్థాయిలను నమోదు చేశాయి. ముండ్కా (464), ఆర్‌కె పురం (458), మధుర రోడ్ (458), నెహ్రూ నగర్ (456), ఐటిఓ (452)లలో అత్యధిక AQI రీడింగులు నమోదయ్యాయి.

AQI స్థాయిలను ఎలా అర్థం చేసుకోవాలంటే..

  • AQI స్థాయిలు 100 నుంచి 200 మధ్య ఉంటే మధ్యస్థంగా ఉన్నట్లు భావిస్తారు. ఈ మధ్యస్థ స్తాయిలు ఉబ్బసం, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి కొంచెం ఇబ్బందిని కలిగిస్తాయి.
  • AQI స్థాయిలు 201 నుంచి 300 మధ్య ఉంటే పేలవంగా ఉన్నట్లు భావించాలి. దీర్ఘాకాలిక శ్వాస కోసం సమస్యలు ఉన్నవారు ఎక్కువ సేపు బయట ఉంటే శ్వాసలో ఇబ్బంది కలుగవచ్చు.
  • AQI స్థాయిలు 301 నుంచి 400 మధ్య ఉంటే పేలవంగా

    ఉన్నట్లు భావించాలి. దీర్ఘకాలిక బహిర్గతం వల్ల శ్వాసకోశ అనారోగ్యానికి కారణం కావచ్చు.

  • AQI స్థాయిలు 401 నుంచి 500 మధ్య ఉంటే తీవ్రమైన స్థాయిగా భావించాలి.ఆరోగ్యకరమైన వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే ఉన్న అనారోగ్యాలు ఉన్నవారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×