E-Paper
Advertisement

Cyclone Shakti: దూసుకొస్తున్న శక్తి సైక్లోన్.. తీర ప్రాంతాలకు ఐఎండీ కీలక హెచ్చరికలు!

Cyclone Shakti: దూసుకొస్తున్న శక్తి సైక్లోన్.. తీర ప్రాంతాలకు ఐఎండీ కీలక హెచ్చరికలు!
Advertisement

Cyclone Shakti Effect:

అరేబియా సముద్రంలో ఏర్పడిన శక్తి తుఫాన్, తీవ్ర తుఫాన్ గా మారినట్లు భారత వాతావరణ కేంద్రం(IMD) వెల్లడించింది. ఈ తుఫాన్ కారణంగా గంటలకు ఏకంగా 100 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఈ తుఫాన్ ప్రస్తుతం తీరానికి పశ్చిమ దిశగా కదులుతున్నట్లు తెలిపింది.

అల్లకల్లోకలంగా మారిన అరేబియా సముద్రం

శక్తి తుఫాన్ కారణంగా అరేబియా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. గుజరాత్ తీరం ఉగ్రరూపం దాల్చింది. సముద్రంలో భారీ అలలు ఏర్పడుతున్నాయి. ఈ తుఫాన్ గుజరాత్‌ లోని ద్వారక సమీపంలో పశ్చిమ నైరుతి దిశగా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర తీరం, పాకిస్తాన్ తీరం వెంబడి సముద్రంలో కల్లోలం ఉంటుందని వెల్లడించింది. ఆదివారం వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని తెలిపింది.

శక్తి తుఫాన్ ప్రస్తుతం ఎక్కడ ఉందంటే?

Advertisement

శక్తి తుఫాన్ కు సంబంధించి ఐఎండీ కీలక విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం ఈ తుఫాన్ ద్వారకకు 420 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది. అదే సమయంలో కరాచీకి 290 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. అక్కడి నుంచి నైరుతి దిశగా కదులుతుంది. ఆదివారం నాటికి పశ్చిమ మధ్య అరేబియా సముద్రానికి చేరే అవకాశం ఉంటుంది. సోమవారం ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.

మహారాష్ట్ర, గుజరాత్‌కు కీలక హెచ్చరికలు  

శక్తి తుఫాన్‌ నేపథ్యంలో ఐఎండీ మహారాష్ట్రకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర తీరం, గుజరాత్‌ తీరంలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపించే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మహారాష్ట్రలోని థానే, పాల్ఘడ్, రాయ్‌ గడ్, రత్నగిరి, సింధు దుర్గ్‌ లో ఈ తుఫాన్ కారణంగా ఈ నెల 7 వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. దీని ప్రభావంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మరో రెండు రోజుల పాటు మహారాష్ట్ర తీర ప్రాంతంలో విపరీతమైన గాలులు వీస్తాయని తెలిపింది.

రంగంలోకి డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమ్స్

Advertisement

అటు గుజరాత్ లోని ద్వారక, జామ్‌ నగర్‌, పోరు బందర్‌, సూరత్‌, నవ్‌ సారి, వల్సాడ్‌, దామన్‌, దాద్రానగర్‌ హవేలి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్ లోని డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలు రెడీ అయ్యాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. సోమవారం నాటికి ఈ తుఫాన్ బలహీనపడే అవకాశం ఉండటంతో అప్పటి వరకు అలర్ట్ గా ఉండాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయక బృందాలకు సూచించారు.

Read Also: వీధి కుక్కలకు జీవిత ఖైదు.. జైల్లో పెట్టి మక్కెలు ఇరగదీసుడే.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×