E-Paper
Advertisement

కాక్రోచ్ పోస్ట్ రగడ.. చిక్కుల్లో RAF ఆఫీసర్ సోనియా సెహ్రావత్!

కాక్రోచ్ పోస్ట్ రగడ.. చిక్కుల్లో RAF ఆఫీసర్ సోనియా సెహ్రావత్!
Advertisement

Sonia Sehrawat: ఢిల్లీ వీధుల్లో నాలుగు రోజులుగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. లాఠీలు విరుగుతున్నాయి. టియర్ గ్యాస్‌ పొగలు కమ్ముతున్నాయి. ఐనా యువత నీట్ యుద్ధం ఆపడంలేదు. ఐతే మొన్న జరిగిన చలో పార్లమెంట్‌ ఆందోళన ఎంత రణరంగమైందో అందరికీ తెలిసిందే.. నిరసనకారుల్ని అడ్డుకునేందుకు కేంద్ర బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. ఇక్కడే డ్యూటీ చేసిన సీఆర్పీఎఫ్ ఆఫీసర్ ఇప్పుడు పెద్ద రాజకీయ రచ్చకు తెరలేపారు.

సోనియా సెహ్రావత్ రియల్ స్టోరీ..

Advertisement

హర్యానాకు చెందిన సోనియా సెహ్రావత్.. RAF విభాగంలో అసిస్టెంట్ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 20న సీజేపీ చేస్తున్న ప్రొటెస్ట్‌ను అడ్డుకునేందుకు డ్యూటీ వేశారు. డ్యూటీని సక్రమంగానే చేశారు. నిజానికి సోనియా కేవలం పోలీస్ ఆఫీసర్ మాత్రమే కాదు. సోషల్ మీడియాలో సెన్సేషన్ స్టార్ కూడా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఏకంగా 6లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పెట్టే ఫిట్‌నెస్, టూరిజం, లైఫ్‌స్టైల్‌ పోస్టులకు లైకుల వర్షమే కురుస్తుంది. ఖాకీ డ్రెస్సులో ఉన్నప్పుడు డిసిప్లిన్, సెల్‌ పట్టుకున్నప్పుడు గ్లామర్‌ను బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది. అయితే జులై 20న నిరసన ముగిసిన తర్వాత ఇన్‌స్టాలో సోనియా చేసిన పోస్ట్ పరిస్థితిని తలకిందులు చేసింది.

కాక్రోచ్‌ల పని అయిపోయింది..

Advertisement

రివర్స్‌లో పడిపోయిన బొద్దింక ఫోటోను షేర్ చేస్తూ ‘కాక్రోచ్‌లా పని అయిపోయింది’ అంటూ ఆమె పెట్టిన పోస్ట్.. విద్యార్థుల గుండెల్లో శూలంలా గుచ్చుకుంది. క్షణాల్లో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. ‘శాంతిభద్రతలను కాపాడాల్సిన అధికారిణి, ఆందోళనకారులను అవమానిస్తారా?’ అంటూ నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అలర్ట్ అయిన సోనియా ఆ పోస్ట్‌ను వెంటనే డిలీట్ చేశారు. ఐనప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ పోస్ట్‌ స్క్రీన్‌ షాట్లు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు సోనియా నుంచి వివరణ కోరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ లేడీ ఆఫీసర్‌కు ఇన్‌స్టా పోస్ట్ తిప్పలు తెచ్చిపెట్టింది.

Also Read: మానవత్వం చాటుకున్న కోమటిరెడ్డి.. ఐఐటీ విద్యార్థినికి రూ. 10 లక్షల సాయం!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×