E-Paper
Advertisement

Crime: భర్తను హత్య చేసిన భార్య.. ఐదురోజులుగా ఇంట్లోనే డెడ్ బాడీ.. చివరికి..

Crime: భర్తను హత్య చేసిన భార్య.. ఐదురోజులుగా ఇంట్లోనే డెడ్ బాడీ.. చివరికి..
Advertisement

Crime: భర్తను హత్య చేసి ఐదు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే దాచి పెట్టింది ఓ మహిళ. చుట్టుపక్కల వాళ్లకు ఎటువంటి అనుమానం రాకుండా మ్యానేజ్ చేసింది. అయితే దుర్వాసన రావడంతో గుట్టురట్టయింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పుర్‌లో చోటుచేసుకుంది.

వ్యాపారస్థుడు అమర్‌నాథ్ సింగ్ తన భార్య మీరాతో కలిసి సుభాష్ నగర్‌లో నివసిస్తున్నాడు. అయితే మీరా మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలవుతుండేవి. ఈక్రమంలో ఒకరోజు వారిద్దరి మధ్య వివాదం చోటుచేసుకొని అదికాస్త పెద్దదిగా మారింది. దీంతో కోపంతో రగిలిపోయిన మీరా తన భర్తను హత్య చేసింది. మృతదేహాన్ని ఇంట్లోనే దాచి పెట్టింది.

Advertisement

అయితే ఐదు రోజుల నుంచి అమర్‌నాథ్ సింగ్ కనిపించకుండా పోవడం.. అదే సమయంలో వారి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో అమర్‌నాథ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మీరాను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×