E-Paper
Advertisement

CPR to Snake : పాముకు సీపీఆర్ చేసిన కానిస్టేబుల్.. ఆ తర్వాత ఏమైందంటే..

CPR to Snake : పాముకు సీపీఆర్ చేసిన కానిస్టేబుల్.. ఆ తర్వాత ఏమైందంటే..
Advertisement

CPR to Snake : హార్ట్‌ బీట్ సడెన్‌గా ఆగినప్పుడు అటు డాక్టర్లైనా.. మాములుగా ఫస్ట్‌ ఎయిడ్‌ తెలిసిన వారైనా చేసేది సీపీఆర్‌. సీపీఆర్‌ చేస్తూ ఆక్సిజన్ అందించి తిరిగి ప్రాణం పోస్తారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ కూడా ఇలా సీపీఆర్‌ చేసి ఓ ప్రాణం కాపాడాడు. అయితే అతను కాపాడింది మనిషి ప్రాణం అనుకుంటే మీరు పొరబడినట్టే. అతను కాపాడింది తన కాటుతో మనుషుల ప్రాణాలు తీసే ఓ పాము ప్రాణం.

మధ్యప్రదేశ్‌లోని న‌ర్మదాపురంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఓ రెసిడెన్షియ‌ల్ కాల‌నీలో ఉన్న పైప్‌లైన్‌లోకి ఈ పాము చొరబడింది. దానిని బయటికి రప్పించేందుకు అందులోకి ఓ క్రిమిసంహార‌క మందును వ‌దిలారు. పాము అయితే బయటికి వచ్చింది కానీ.. స్పృహ త‌ప్పిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ అతుల్ శ‌ర్మ వెంటనే పాముకు సీపీఆర్ చేసి ర‌క్షించాడు. పామును ప‌ట్టుకుని ప‌రీక్షించిన అత‌ను, దాని శ్వాస‌ను చెక్ చేశాడు. ఆ త‌ర్వాత ఆ పాము నోట్లోకి గాలి ఊదాడు. దీంతో దెబ్బకు లేచి కూర్చుంది ఆ పాము.

Advertisement

కానిస్టేబుల్ అతుల్ శ‌ర్మ గ‌డిచిన 15 ఏళ్లలో సుమారు 500 పాముల్ని ప‌ట్టుకున్నాడు. తాను బతికించిన పామును తీసుకెళ్లి అడవిలో వదిలేశాడు. అయితే పాముకు సీపీఆర్‌ చేయడం సాధ్యం కాదని.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన పాము కొద్ది సేపటి తర్వాత లేచి ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా పామును కాపాడేందుకు అతని ప్రయత్నాన్ని మాత్రం అభినంచాల్సిందే.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×