// // Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌ ఇష్యూ కొత్త మలుపు.. నేరుగా సుప్రీంకోర్టుకు, రిలీఫ్ లభిస్తుందా? -->
E-Paper
Advertisement

మీనాక్షి నటరాజన్‌ ఇష్యూ కొత్త మలుపు.. నేరుగా సుప్రీంకోర్టుకు, రిలీఫ్ లభిస్తుందా?

మీనాక్షి నటరాజన్‌ ఇష్యూ కొత్త మలుపు.. నేరుగా సుప్రీంకోర్టుకు, రిలీఫ్ లభిస్తుందా?
Advertisement

Meenakshi Natarajan: కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. బుధవారం సీఈసీని కాంగ్రెస్ నేతలు కలిసినా ఎలాంటి ఉపశమనం లేనట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్‌ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. గురువారం ఉదయం వెకేషన్ బెంచ్ ముందు అత్యవసర విచారణ కోరుతూ ప్రస్తావించే అవకాశం ఉంది.

మీనాక్షి నటరాజన్‌ నామినేషన్ వ్యవహారం కొత్త మలుపు

Advertisement

మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ నేత మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. రిటర్నింగ్‌ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ న్యాయస్థానం గడప తొక్కింది.

దీనిపై బుధవారం కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, అభిషేక్‌ మనుసింఘ్వి, వివేక్‌ తన్ఖా, రణదీప్‌ సూర్జేవాలా, భూపేశ్‌ బఘెల్, దీపాదాస్‌మున్షీ, మీనాక్షి టీమ్ ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి సానుకూల సాంకేతాలు రాలేనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానాన్ని ఆశ్రయంచారు. ఈ పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు బలమైన వాదనలు వినిపించనున్నారు.

Advertisement

సుప్రీంకోర్టుని ఆశ్రయించిన మీనాక్షి నటరాజన్

ఈ వివాదంపై కాంగ్రెస్‌ పార్టీలో ఇంటాబయటా అంతర్గతంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ నుంచి వచ్చిన సమాచారం ఈ వివాదానికి కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. మధ్యప్రదేశ్‌ మంత్రి కైలాష్‌ విజయ కూడా ఇదే తరహా వ్యాఖ్యాలు చేశారు. కాంగ్రెస్‌ నాయకులు ఈ సమాచారాన్ని లీక్ చేసి ఉండవచ్చని అంటున్నారు. ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరడంతో న్యాయస్థానం నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

తెలంగాణ వ్యవహారం కేవలం కోర్టు నోటీసుకు సంబంధించిందని, ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించాల్సిన క్రిమినల్ కేసు కాదన్నది కాంగ్రెస్ నేతల మాట. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను వెల్లడించాలన్నారు. మీనాక్షి నటరాజన్‌పై క్రిమినల్‌ కేసు ఉన్నట్లు చెప్పడం సమంజసం కాదన్నారు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ. సంబంధిత కోర్టు ఈ కేసు స్వీకరించలేదన్నారు.

ALSO READ: ఒమన్ నుంచి భారత్‌కు గ్యాస్ పైప్‌లైన్.. ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్, హార్మూజ్‌ సంబంధం లేకుండా

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×