E-Paper
Advertisement

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు  పూర్తిగా దగ్ధం!
Advertisement

Coimbatore: తమిళనాడులోని కోయంబత్తూరు యమునా నగర్‌లో వంట గ్యాస్ సిలిండర్ల లీకేజీ కారణంగా సంభవించిన భారీ పేలుడు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఓ ఇంట్లో వంట చేస్తుండగా అకస్మాత్తుగా గ్యాస్ లీకై సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలాయి. ఈ పేలుళ్ల ధాటికి మంటలు వేగంగా వ్యాపించడంతో, పక్కపక్కనే ఉన్న వరుసగా నాలుగు ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

ఇళ్లలోని విలువైన సామాగ్రి, వస్తువులు అగ్నికి ఆహుతి కావడంతో భారీగా ఆస్తినష్టం సంభవించింది. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే మొదటి పేలుడు శబ్దానికి స్థానికులు అప్రమత్తమై, ఇళ్లలో నుండి రోడ్లపైకి పరుగులు తీయడంతో తృటిలో పెద్ద ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాద తీవ్రతకు ఇళ్లు ధ్వంసమైన తీరును చూసి బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×