E-Paper
Advertisement

విజయ్ కేబినెట్ విస్తరణ.. అసలు గేమ్ మొదలైంది.. మిత్రుల నుంచి బెదిరింపులు, రేసులో అన్నాడీఎంకె రెబెల్స్

విజయ్ కేబినెట్ విస్తరణ.. అసలు గేమ్ మొదలైంది.. మిత్రుల నుంచి బెదిరింపులు, రేసులో అన్నాడీఎంకె రెబెల్స్
Advertisement

Chennai: ముఖ్యమంత్రి పదవి ముల్ల కంచె లాంటింది? సమయం, సందర్భం వచ్చినప్పుడు పలువురు నేతలు చెబుతుంటారు. తమిళనాడులో సీఎం విజయ్ పరిస్థితి అలాంటిదే. బొటాబొటీ మెజార్జీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న టీవీకే ప్రభుత్వానికి మిత్రుల నుంచి అప్పుడు వార్నింగ్‌లు మొదలయ్యాయి. దీంతో కేబినెట్ విస్తరణ పూర్తి అయ్యేసరికి ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో?

విజయ్ కేబినెట్ విస్తరణ.. అసలు గేమ్ మొదలైంది

Advertisement

మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సీఎం విజయ్‌. రేపోమాపో కేబినెట్ విస్తరించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. మంత్రివర్గంలోకి అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలను తీసుకుంటారంటూ వచ్చిన వార్తలు గందరగోళానికి దారితీశాయి. దీంతో మద్దతు ఇచ్చిన మిత్రపక్షాలు.. టీవీకే ప్రభుత్వానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాయి.

విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌, వీసీకే, లెఫ్ట్‌ పార్టీలతోపాటు అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. అయితే అన్నాడీఎంకె రెబల్ నేతలకు కేబినెట్ బెర్త్‌లు కేటాయిస్తారంటూ వార్తలు చక్కర్లు కొడుకుతున్నాయి. పరిస్థితి గమనించిన వీసీకే నేత తిరుమావళవన్‌ రియాక్ట్ అయ్యారు.

Advertisement

మిత్రుల నుంచి బెదిరింపులు, రేసులో అన్నాడీఎంకె రెబెల్స్

అన్నాడీఎంకె రెబల్స్‌కు మంత్రివర్గంలో అవకాశం ఇస్తే తమ మద్దతు అంశంపై పునరాలోచించుకోవాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించారు. అటు వామపక్షాల నుంచి ఇలాంటి రియాక్షన్ వచ్చింది. ఏ వర్గాన్ని ప్రభుత్వంలో చేర్చుకున్నా ప్రజా తీర్పుకు విరుద్ధమే అవుతుందని పేర్కొంటున్నాయి. దీంతో ఏం చెయ్యాలో టీవీకే నేతలు తలలు పట్టుకుంటున్నారు.

మిత్రుల నుంచి ఇలాంటి రియాక్షన్ రావడంతో టీవీకే పార్టీ రియాక్ట్ అయ్యింది. దీనిపై మంత్రి అధవ్ అర్జున నోరు విప్పారు. అన్నాడీఎంకే రెబెల్స్ కేబినెట్‌లోకి వస్తారనేది కేవలం ఊహాగానాలు మాత్రమేనని అన్నారు. ఈ విషయమై మిత్రపక్షాలతో మాట్లాడిన తర్వాత ఓ నిర్ణయానికి వస్తామన్నారు. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరుగుతుందనే దానిపై ముఖ్యమంత్రి తేదీలను ప్రకటిస్తారని మంత్రి తెలిపారు.

ALSO READ: అవినీతిపై సీఎం విజయ్ సర్జికల్ స్ట్రైక్.. లంచగొండులను పట్టిస్తే రూ. 1 లక్ష రివార్డు?

మంత్రుల పూర్తి పోర్ట్‌ఫోలియోలతో కూడిన జాబితాను గవర్నర్‌కు అందజేశామని, దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ వస్తుందన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులు బాధ్యతలు స్వీకరించారని, శాఖలను ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించారు మంత్రి అర్జున.

అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీకి 108 సీట్లు వచ్చాయి. అయితే కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్‌ పార్టీల మద్దతుతో విజయ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బలపరీక్ష నిరూపణ సమయంలో అన్నాడీఎంకే రెబల్‌ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. దీంతో విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 144కి పెరిగిన విషయం తెల్సిందే.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×