E-Paper
Advertisement

కరూర్ త్యాగాలకు న్యాయం.. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన సీఎం విజయ్

కరూర్ త్యాగాలకు న్యాయం.. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన సీఎం విజయ్
Advertisement

CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపిన ముఖ్యమంత్రి, TVK అధినేత విజయ్ కరూర్‌లో పర్యటించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన విషాదకర సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆయన స్వయంగా పరామర్శించారు. ఆనాడు జరిగిన ఒకే ఒక్క దుర్ఘటన తన గుండెల్లో ఎప్పటికీ మారని గాయంగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన విజయ్, ఆ బాధిత కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను స్వయంగా అందజేశారు.

ఆనాటి విషాదం.. సీఎం విజయ్ భావోద్వేగం
2025 సెప్టెంబర్ నెలలో నిర్వహించిన టీవీకే భారీ ర్యాలీలో ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది అభిమానులు, కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటనను గుర్తుచేసుకుంటూ ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన రాజకీయ ప్రస్థానంలోనే కాకుండా, తన జీవితంలోనే అది అత్యంత బాధాకరమైన, దురదృష్టకరమైన రోజు అని ఆయన పేర్కొన్నారు. ఆనాడు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, వారిని అన్ని విధాలా ఆదుకుంటానని స్పష్టం చేశారు.

Advertisement

32 కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
బాధిత కుటుంబాలకు కేవలం నష్టపరిహారంతో సరిపెట్టకుండా, వారి జీవితాలకు శాశ్వత ఆర్థిక భద్రత కల్పించే దిశగా సీఎం విజయ్ అడుగులు వేశారు. ఈ కరూర్ పర్యటనలో భాగంగా, తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు చెందిన 32 మంది అర్హులైన సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. మిగిలిన కుటుంబాలకు కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ అండ దొరకడంతో ఆయా కుటుంబాల్లో కొంతైనా ఉపశమనం వ్యక్తమవుతోంది.

డీఎంకేపై సీఎం ఆగ్రహం
ఈ పర్యటనలో సీఎం విజయ్ రాజకీయ విమర్శల పదును పెంచారు. ఆనాడు సభ జరిగిన రోజున నాటి అధికార యంత్రాంగం, పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమవ్వడమే కాకుండా, పోలీసులు ఒక డ్రామా ఆడారని మండిపడ్డారు. గత డీఎంకే ప్రభుత్వం కేవలం రాష్ట్రాన్ని లూటీ చేయడానికే ప్రాధాన్యత ఇచ్చిందని, ప్రజల ప్రాణాలను, భద్రతను గాలికొదిలేసిందని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

Advertisement

ప్రజా పక్షపాతిగా విజయ్ మార్క్ పాలన
సభలో జరిగిన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబాలను మర్చిపోకుండా విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. ఇచ్చిన మాట ప్రకారం బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ద్వారా తానూ ఒక ప్రజా పక్షపాతి నని విజయ్ నిరూపించుకున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తున్న ఈ సరికొత్త రాజకీయ శైలిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: మైనర్లకు సోషల్ మీడియా క్లోజ్.. తెరవెనుక అసలు ఏం జరుగుతోంది?

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×