E-Paper
Advertisement

Class X Student heart failure: రాజస్థాన్‌లో విషాదం, గుండెపోటుతో స్టూడెంట్ మృతి..

Class X Student heart failure: రాజస్థాన్‌లో విషాదం, గుండెపోటుతో స్టూడెంట్ మృతి..
Advertisement

Class X Student heart failure: ఈ మధ్యకాలం దేశంలో గుండె పోటు మరణాలు విపరీతంగా పెరిగాయి. ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ కుప్పకూలుతున్నారో తెలియలేదు. ఆ తరహా కేసులో వారానికి నాలుగైదు నమోదు అవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ లెక్కన పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా రాజస్థాన్‌లో గుండెపోటుతో పదో తరగతి చదువుతున్న విద్యార్థి స్పాట్‌లో మృతి చెందారు.

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాకు చెందిన యతేంద్ర బండికుయ్‌లో పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం ఏడున్నర గంటలకు పాఠశాలకు వచ్చాడు. కారిడార్‌లో నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అందుకు సంబంధించిన సీసీటీవీ కెమెరాలో ఆయా దృశ్యాలు రికార్డు అయ్యాయి.

Advertisement

తరగతి రూమ్‌‌లోకి వెళ్తుండగా కారిడార్‌లో కుప్పకూలిపోయాడు యతేంద్ర. వెంటనే పాఠశాల నిర్వాహకులు వెంటనే విద్యార్థిని సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడు. యతేంద్ర మెడికల్ రిపోర్టు ప్రకారం.. యతేంద్రకు చిన్నప్పటి నుంచి గుండె సమస్య ఉంది. గుండె హోల్ పడినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు.

పాఠశాల యాజమాన్యం పేరెంట్స్‌కి యతేంద్ర మృతి విషయం చెప్పింది. వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో బాబుకు పోస్టుమార్టం నిర్వహించడానికి నిరాకరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. యతేంద్ర అంత్యక్రియల కోసం కుటుంబసబ్యులు పూర్వీకుల గ్రామానికి బయలుదేరి వెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

ALSO READ:  బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సర్కార్, విపక్షాలు వాకౌట్..

అంతకుముందు రోజు అంటే శుక్రవారం యతేంద్ర.. తోటి స్టూడెంట్స్‌తో ఉల్లాసంగా గడిపాడు. క్లాస్ రూమ్ లోకి విద్యార్థులకు చాక్లెట్లు పంచిబెట్టాడు. ఇంట్లో కేక్ కట్ చేసి ఫోటోలు తీసుకున్నాడు. మరుసటి రోజు ఈ లోకాన్ని వదిలివెళ్లిపోయాడు. ఈ విషయం తెలియగానే తోటి విద్యార్థులు షాకయ్యారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×