E-Paper
Advertisement

ఘోర ప్రమాదం.. పవర్ ప్లాంట్‌లో బాయిలర్ పేలి 9 మంది మృతి.. 40 మందికి పైగా గాయాలు!

ఘోర ప్రమాదం.. పవర్ ప్లాంట్‌లో బాయిలర్ పేలి 9 మంది మృతి.. 40 మందికి పైగా గాయాలు!
Advertisement

Power Plant Blast Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి  జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. వేదాంత లిమిటెడ్ పవర్ ప్లాంట్‌లో సంభవించిన పేలుడులో తొమ్మిది మంది కార్మికులు అక్కడికక్కడే మరణించగా, 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సింగితరాయ్ గ్రామంలోని ఈ ప్లాంట్‌లో మధ్యాహ్నం సమయంలో బాయిలర్ ట్యూబ్ పేలడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక యంత్రాంగం, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు, దీంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు.

Advertisement

ప్లాంట్‌లో పని జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాయిలర్ పేలడంతో అక్కడున్న కార్మికులు చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ప్రమాద తీవ్రతకు ప్లాంట్ భవనం కొంత మేర దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు వేదాంత యాజమాన్యం మరియు ప్రభుత్వం పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Read Also: బెంబేలెత్తిస్తున్న ఎండలు.. 22 జిల్లాల్లో 42 డిగ్రీలు దాటిన టెంపరేచర్, ఈ టైంలో జాగ్రత్త!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×