E-Paper
Advertisement

Chhattisgarh: దద్దరిల్లిన దండకారణ్యం.. ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోలు హతం..

Chhattisgarh: దద్దరిల్లిన దండకారణ్యం.. ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోలు హతం..
Advertisement

Maoists Encounter In Chhattisgarh: మరోసారి దండకారణ్యం రక్తసిక్తమైంది. తుపాకీ తూటాలతో ఛత్తీస్‌గఢ్ అడవులు దద్దరిల్లాయి. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.

ఛత్తీస్‌గఢ్‌లో గురువారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు భీకర పోరు జరిగింది. డీఆర్‌జీ, బస్తర్ ఫైటర్స్, మూడు జిల్లాల ఎస్టీఎఫ్ సంయుక్త బలగాలు నక్సల్స్ వ్యతిరేక సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించాయి. దీంతో వారికి మావోయిస్టులు తారసపడగా ఇరువర్గాలు కాల్పులకు దిగడంతో ఏడుగురు మావోలు హతమైనట్లు అధికారులు పేర్కొన్నారు..

Advertisement

కొన్ని మీడియా కథనాల ప్రకారం, నక్సల్ ప్రభావిత నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మద్ ప్రాంతంలో భద్రతా దళాలు కొత్త క్యాంపును ప్రారంభించాయి. ఇటీవలి కాలంలో మావోయిస్టులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపడంతో మావోలు కలత చెందారని.. అబుజ్మద్ ప్రాంతంలో అగ్రనేతలు గుమిగూడారని సమాచారం అందుకున్న బలగాలు సోదాలు నిర్వహించాయి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×