E-Paper
Advertisement

Chhatarpur Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. దైవదర్శనానికి వెళ్తూ ఏడుగురు దుర్మరణం

Chhatarpur Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. దైవదర్శనానికి వెళ్తూ ఏడుగురు దుర్మరణం
Advertisement

Chhatarpur road accident seven people lost their lives: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్తర్‌పూర్ జిల్లాలో ఆటో ఎదురుగా ఉన్న ట్రక్కును వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా..ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తర్‌పూర్ రైల్వేస్టేషన్ నుంచి ఆటోలో భక్తులు బాగేశ్వర్ ధామ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఝాన్సీ ఖజురఘో రహదారికి ఆటో చేరుకుంది. అనంతరం అధిక వేగంగా ట్రక్కను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఆటో డ్రైవర్ అతివేగంతో నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

Advertisement

Also Read: నిమోనియా.. ఎయిమ్స్‌లో చేరిన సీపీఎం కార్యదర్శి సీతారం ఏచూరి

ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ప్రేమ్ నారాయన్ కుష్వాహా తోపాటు జనార్ధన్(45), మను శ్రీవాస్తవ, నాన్హే, గోవింద్, జనార్ధన్ కుమార్తె(18)తో పాటు మరో ఒక్కరు చనిపోయారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×