E-Paper
Advertisement

Chennai Rains : చెన్నైలో రోడ్లన్నీ జలమయం..

Chennai Rains : చెన్నైలో రోడ్లన్నీ జలమయం..
Advertisement
Chennai Rains : తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, మధురై, కడలూరు, తిరువళ్లూరు, కోయంబేడు, కాంచీపురం, చెంగల్‌పట్టులో ఎడతెరపిలేకుండా వాన పడుతున్నది. భారీవర్షాలకు మైలాడుదురై సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వరద పోటెత్తడంతో చెరువు కట్టలు తెగిపోవడంతో రోడ్లు ధ్వంసమయ్యాయి. ఊటీ ఘాట్‌రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోయంబత్తూరులోని డ్యామ్‌లు పూర్తిగా నిండిపోయాయి.

ఏకధాటిగా కురుస్తున్న వానలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. చెన్నైలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరదనీరు చేరడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×