E-Paper
Advertisement

Smriti Irani Nomination: నేడు నామినేషన్ దాఖలు చేయనున్న స్మృతి ఇరానీ

Smriti Irani Nomination: నేడు నామినేషన్ దాఖలు చేయనున్న స్మృతి ఇరానీ
Advertisement

Smriti Irani Nomination Details: ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ లోక్ సభ నియోజకవర్గం ఈసారి చాలా కీలకంగా మారింది. ఈసారి ఎలాగైనా ఈ స్థానంలో విజయం సాధించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఇటు బీజేపీ కూడా ఈ స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. అయితే, నేడు కేంద్రమంత్రి స్మతి ఇరానీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకంటే ముందుగా ఆమె అయోధ్యలోని రామ్ లల్లాను దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా నియోజకవర్గానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

అయితే, అమేథీలో మే 20న ఐదో దశలో ఓటింగ్ జరగనున్నది. ఈ నెల 26న అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ కు మే 3 చివరి తేదిగా ఉంది. అయితే, కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. ఈసారి ఎలాగైనా ఇక్కడి నుంచి విజయం సాధించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికలో చాలా లోతుగా ఆలోచన చేస్తుంది. అయితే, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు టికెట్ ఇవ్వనున్నదని ప్రచారం జరిగింది. మరోవైపు రాహుల్ గాంధీయే ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ఆహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Also Read: ప్రధాని హోదాలో మోదీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు: ప్రియాంక గాంధీ

నువ్వా నేనా అన్నట్లుగా పోటీకి సై అంటున్న కాంగ్రెస్, బీజేపీ ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అమేథీ లోక్ సభ స్థానం చాలా కీలకంగా మారింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×