E-Paper
Advertisement

ఇరాన్ యుద్ధం పరిణామాలు.. కోతలకు సిద్ధమైన కేంద్రం, గ్యాస్ సబ్సిడీకి బ్రేక్, షాకైన పేద-మధ్య తరగతి ప్రజలు

ఇరాన్ యుద్ధం పరిణామాలు.. కోతలకు సిద్ధమైన కేంద్రం, గ్యాస్ సబ్సిడీకి బ్రేక్, షాకైన పేద-మధ్య తరగతి ప్రజలు
Advertisement

LPG Cylinders: ఇరాన్-అమెరికా యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకరోజు అమెరికా దాడులు చేస్తుంటే.. మరొక రోజు ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. ఈ ఉద్రిక్తతల ప్రభావం చమురుపై పడింది. పరిస్థితి గమనించిన కేంద్రప్రభుత్వం, సబ్సిడీపై ఇచ్చే సిలిండర్ల సంఖ్యను సగానికి పైగా కుదించేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో  పేద-మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ఇరాన్ యుద్ధం పరిణామాలు.. కోతలకు సిద్ధమైన కేంద్రం

Advertisement

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు గట్టి షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం కింద రాయితీతో ఇచ్చే సిలిండర్ల సంఖ్యలో కోత వేసింది. లబ్ధిదారులకు ఏడాదికి నాలుగు సిలిండర్లను సరఫరా చేయనుంది. 14.2 కిలోల బరువున్న 9 సిలిండర్లను రాయితీ ధరకు ప్రభుత్వం అందజేస్తోంది.

పీఎంయూవై పథకం ప్రారంభంలో 12 సిలిండర్లు సరఫరా చేసేది కేంద్రం. గతేడాది వీటి సంఖ్యను 9కి పరిమితం చేసింది. ఉజ్వల లబ్ధిదారుల సగటు వార్షిక వినియోగాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం, రాయితీ సిలిండర్లను నాలుగుకు తగ్గించినట్లు పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శి వెల్లడించారు.

Advertisement

గ్యాస్ సబ్సిడీకి బ్రేక్, షాకైన పేద-మధ్య తరగతి ప్రజలు

వంటకు ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంతోపాటు అందుబాటు ధరలో సరఫరా చేసేందుకు 14.2 కిలోల సిలిండర్‌పై రూ.200 రాయితీని నాలుగేళ్ల కిందట ప్రకటన చేసింది కేంద్రం. దీని ప్రకారం ఏడాదికి 12 సిలిండర్లు ఇచ్చేది. రాయితీ నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేసేది. 2023 అక్టోబరులో సిలిండర్‌పై రాయితీ రూ.300లకు పెరిగిన విషయం తెల్సిందే.

గతేడాది రాయితీ సిలిండర్ల సంఖ్యను 12 నుంచి తొమ్మిదికి తగ్గించింది కేంద్రం. ఢిల్లీలో ఉజ్వల యోజన లబ్ధిదారులకు రూ.300 రాయితీ రావడంతో సిలిండర్‌ ధర రూ.642గా ఉంది. ఒక్కో గ్యాస్ సిలిండర్‌ సరఫరాకు కంపెనీలు రూ.1,600 వరకు వెచ్చిస్తుంటాయని కార్యదర్శి వెల్లడించారు.

ALSO READ: పెళ్లికి ముందు శారీరక బంధం పెట్టుకుంటే.. మంచోడు కాదని చెప్పలేం.. సుప్రీంకోర్టు సంచలనం

ఉజ్వల వినియోగదారులకు తక్కువ ధరకు సరఫరా చేస్తున్నందున ప్రతి సిలిండర్‌పై రూ.1,000 వరకు లబ్ధి కలుగుతుందన్నారు. మొత్తానికి చమురు కంపెనీలపై పడుతున్న అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి సబ్సిడీ సిలిండర్లలో కోత విధించింది కేంద్రం.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×