E-Paper
Advertisement

Road Safety Reward: ప్రాణం కాపాడండి.. రూ. 25,000 గెలుచుకోండి.. కేంద్రం తెచ్చిన పథకం విశేషాలివే!

Road Safety Reward: ప్రాణం కాపాడండి.. రూ. 25,000 గెలుచుకోండి.. కేంద్రం తెచ్చిన పథకం విశేషాలివే!
Advertisement

Road Safety Reward: రోడ్డు ప్రమాద బాధితులను కాపాడే సామాన్యులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రమాద సమయంలో బాధితులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడే ‘గుడ్ సమారిటన్ల’కు ఇచ్చే ప్రోత్సాహకాన్ని ఐదింతలు పెంచింది. ఈ మేరకు అమలులోకి వచ్చిన ‘రహ్‌-వీర్‌’ (Rah-Veer) పథకానికి సంబంధించిన వివ‌రాలు ఇక్కడ ఉన్నాయి.

రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన వారికి ఇప్పటివరకు ఇస్తున్న రూ. 5,000 ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం రూ. 25,000కు పెంచింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదానికి గురైన బాధితులకు మొదటి ఏడు రోజుల వరకు అయ్యే చికిత్స ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. దీని కింద గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు చికిత్సను ఉచితంగా అందిస్తారు.

Advertisement

నగదు బహుమతితో పాటు, సదరు వ్యక్తికి ఒక సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్‌ను కూడా అందజేస్తారు. ప్రమాదం జరిగిన మొదటి గంటను (Golden Hour) అత్యంత కీలకంగా పరిగణిస్తారు. ఈ సమయంలో బాధితుడిని ఆసుపత్రికి చేర్చి ప్రాణాపాయం నుంచి కాపాడే ఎవరికైనా ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా పది మంది అత్యుత్తమ రహ్‌-వీర్‌లను ఎంపిక చేస్తారు. వారికి రూ. 1 లక్ష నగదు పురస్కారం, సర్టిఫికేట్ మరియు ట్రోఫీని అందజేస్తారు.

ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించినప్పుడు పోలీసులు లేదా వైద్యులు అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ ఇస్తారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనలను పరిశీలించి, రాష్ట్ర స్థాయి కమిటీకి పంపిస్తుంది. ఒక వ్యక్తికి సంవత్సరానికి గరిష్టంగా ఐదుసార్లు మాత్రమే ఈ అవార్డును అందజేస్తారు.

Advertisement

ఒకరి కంటే ఎక్కువ మంది కలిసి ఒకే బాధితుడిని కాపాడితే, ఆ రూ. 25,000 మొత్తాన్ని వారందరికీ సమానంగా పంచుతారు. ఎంపికైన వారి వివరాలను నిర్ధారించుకున్న తర్వాత, ప్రోత్సాహక మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు.

Read Also: Nizamabad BJP: నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ వ్యూహం మారిందా? మేయర్ సీటుకు కొత్త ట్విస్ట్!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×