E-Paper
Advertisement

Gas Supply: దేశంలో గ్యాస్ కొరత.. మోదీ సర్కార్ భారీ గుడ్ న్యూస్

Gas Supply: దేశంలో గ్యాస్ కొరత.. మోదీ సర్కార్ భారీ గుడ్ న్యూస్
Advertisement

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పెరిగిన గ్యాస్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలకు సరఫరా చేసే వాటాను భారీగా పెంచింది. ప్రస్తుతం అందుతున్న కోటాకు అదనంగా మరో 20 శాతం కమర్షియల్ గ్యాస్‌ను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఈనెల 23వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య అవసరాలకు ఇంధన కొరత లేకుండా చూడటమే లక్ష్యంగా కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఈ అడుగు వేసింది.

కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. గతంలోనే కేంద్రం 10 శాతం మేర సరఫరాను పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాజాగా ప్రకటించిన 20 శాతం కోటా గతంలో పెంచిన దానికి అదనమని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల వ్యాపార వర్గాలకు గ్యాస్ కష్టాలు తీరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. సిలిండర్ల కొరత కారణంగా ధరలు పెరగకుండా నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

Advertisement

ముఖ్యంగా ఆహార రంగంపై ఆధారపడిన చిన్న వ్యాపారులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, రహదారి పక్కన ఉండే దాబాలకు నిరంతరాయంగా గ్యాస్ అందేలా చూడాలని నీరజ్ మిట్టల్ తన లేఖలో పేర్కొన్నారు. పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, పాడి పరిశ్రమలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు నడిపే రాయితీ క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచెన్‌లకు గ్యాస్ కొరత రాకుండా పర్యవేక్షించాలని రాష్ట్రాలకు సూచించారు.

గ్యాస్ పంపిణీ వ్యవస్థలో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని కేంద్రం ఆదేశించింది. వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ వినియోగించే అవుట్‌లెట్‌లకు సిలిండర్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది. పారిశ్రామిక అవసరాల కోసం గ్యాస్ వినియోగం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంధన సరఫరాలో సమతుల్యత పాటించడం ద్వారా ఆహార ధరలు పెరగకుండా కట్టడి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

ALSO READ: Best Offline Apps: ఇంటర్నెట్ లేకపోయినా.. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకొనే ఎమర్జెన్సీ యాప్స్, మ్యాప్‌తో సహా అన్నీ!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×