E-Paper
Advertisement

Lakshadweep : లక్షద్వీప్‌లో కొత్త ఎయిర్‌పోర్టు.. యోచనలో కేంద్రం..!

Lakshadweep : లక్షద్వీప్‌లో కొత్త ఎయిర్‌పోర్టు.. యోచనలో కేంద్రం..!
Advertisement

Lakshadweep : లక్షద్వీప్‌లో మరో కొత్త ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు కేంద్రం ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాల్దీవులను బాయ్‌కాట్‌ చేయాలంటూ నెట్టింట ప్రచారం జరుగుతున్న వేళ ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ ఇటీవల చేపట్టిన పర్యటనతో ఈ దీవుల పేరు ఇప్పుడు మార్మోగుతోంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల చూపు వీటిపై పడింది. ఈ దీవుల కోసం ఇంటర్ నెట్ లో తెగ వెతికేస్తున్నారు. అటు కేంద్రం ప్రభుత్వం కూడా లక్షద్వీప్‌లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అక్కడ కొత్తగా మరో ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ, వాణిజ్య అవసరాలకు ఉపయోగపడేలా మినికోయ్‌లో నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

ఫైటర్‌ జెట్‌లు, సైనిక రవాణా ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు వాణిజ్య విమానాల నిర్వహణ సామర్థ్యం ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ద్వంద్వ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని కేంద్రం కొత్తగా ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తోంది. మినికోయ్‌ దీవుల్లో ఈ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోందని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

వాస్తవానికి మినికోయ్‌ దీవుల్లో రక్షణరంగ అవసరాల కోసం ఎయిర్‌ఫీల్డ్‌ను నిర్మించాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. అరేబియా, హిందూ మహా సముద్రాల్లో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్న వేళా.. ఈ ప్రాంతంపై దృష్టి కేంద్రీకిరించాలని కోస్ట్ గార్డ్ గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

Advertisement

అయితే, కేంద్రం తాజాగా పౌర విమానాలు కూడా రాకపోకలు సాగించేలా ఇక్కడ కొత్త ఎయిర్‌పోర్టును నిర్మించాలని ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దీవుల పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుందని యోచిస్తోంది. ప్రస్తుతం లక్షద్వీప్‌లో ఒకే ఒక్క ఎయిర్‌పోర్టు ఉంది. 1987-88లో అగత్తి దీవుల్లో దాన్ని నిర్మించారు. ఆ తర్వాత దశలవారీగా విస్తరించారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×